Begin typing your search above and press return to search.

ర‌ష్మిక‌కి ఇంట్లో ఆడుకునే వ‌య‌సున్న చెల్లెలు ఉందండోయ్!

By:  Tupaki Desk   |   8 Jan 2023 1:00 PM IST
ర‌ష్మిక‌కి ఇంట్లో ఆడుకునే వ‌య‌సున్న చెల్లెలు ఉందండోయ్!
X
నేష‌న‌ల్ క్ర‌ష్ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అమ్మ‌డు టాలీవుడ్..బాలీవుడ్ ని క‌లిపి దున్నేస్తుంది. `పుష్ప‌`తో వ‌చ్చిన పాన్ ఇండియా గుర్తింపు తో బాలీవుడ్ లో బిజీ అవుతుంది. అలాగని తెలుగు సినిమాలు వ‌దిలిపెట్ట‌డం లేదు. ఇక్క‌డా కోట్ల రూపాయ‌లు పారితోషికం అందుకుంటూ తారా జువ్వ‌లా దూసుకుపోతుంది.

ఇక బాలీవుడ్ కి వెళ్లిన త‌ర్వాత గ్లామర్ గేట్లు శ్రీశైలం డ్యామ్ గేట్లు లా ఎత్తేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఎప్ప‌టిక‌ప్పుడు స్కిన్ షోతో అద‌ర‌గొడుతుంది. పిట్ట‌చిన్న‌దే అయినా కూత ఘ‌నం అన్న మాదిరిగా సంచ‌ల‌నం అవుతుంది. మ‌రి ఈ అంద‌మైన బ్యూటీకి ఓ చిట్టి చెల్లెలు కూడా ఉంద‌న్న సంగ‌తి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

ఏంటి 26? ఏళ్ల ర‌ష్మిక కి చిట్టి చెల్లెలు అనుకుంటున్నారా? ఇక్క‌డ అదే ట్విస్ట్. అవును ర‌ష్మిక కి నిజంగానే ఓ చిన్న చిట్టి చెల్లెలు ఉంది. ఆమె పేరు షీమ‌న్ (9). వీళ్లిద్ద‌రి మ‌ధ్య వ‌య‌సు వ్య‌త్యాసం 16-17 ఏళ్లు ఉంటుంది. ఒక‌ప్పుడు చెల్లి ప‌నుల‌న్నింటిని ర‌ష్మిక చేసేదిట‌. అందుకే షీమ‌న్ త‌న‌ని అక్క అని పిల‌వ‌డం కంటే అమ్మ అనే పిలుస్తుందిట‌.

ర‌ష్మిక కూడా అమ్మ‌లాగే ఫీల‌వుతుందిట‌. ర‌ష్మిక ఎన్ని ప‌నుల్లో బిజీగా ఉన్నా ఇప్ప‌టికీ చెల్లి బాధ్య‌త‌లు అన్ని తానే చూసుకుంటుందిట‌. ఎప్ప‌టిక‌ప్పుడు చెల్లి ఎలా చ‌దువుతుంది? ఎలా ఉంటుంది? వంటి వివ‌రాలు అడిగి తెలుసుకుంటుంది. త‌న ఖ‌ర్చుల‌న్నీ ర‌ష్మికే భ‌రిస్తుందిట‌. ఇద్ద‌రు ఇంట్లో ఉంటే త‌న‌తోనే ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతుందిట ర‌ష్మిక‌.

షీమ‌న్ వయసు 9 సంవత్సరాలు. 2013 లో జన్మించింది. ర‌ష్మికకి ఇలాంటి చిట్టి చెల్లెలు ఉండ‌టం అంద‌ర్నీ ఆశ్చ‌ర్య ప‌రుస్తుంది. ఇంటిలోనే టైంపాస్ అవుతుందంటూ అభిమానులు పోస్ట్ లు పెడుతున్నారు. ర‌ష్మిక త‌ల్లి దండ్రులు పిల్ల‌లు ఇద్ద‌రి మ‌ధ్య గ్యాప్ తీసుకోవ‌డంతోనే ఇంత వ్య‌త్యాసం క‌నిపిస్తుంద‌ని తెలుస్తుంది.