Begin typing your search above and press return to search.

రష్మిక Vs అలియా.. బ‌ద్ధ విరోధుల‌య్యారు

By:  Tupaki Desk   |   11 Dec 2020 12:18 PM IST
రష్మిక Vs అలియా.. బ‌ద్ధ విరోధుల‌య్యారు
X
ఒకే ర‌క‌మైన ఆలోచ‌న‌లు క‌లిగి ఉండే వారు ఒక‌రికొక‌రు ఎదురుప‌డితే ..? ఆ ఇద్ద‌రి మ‌ధ్యా పోటీ త‌ప్ప‌దు. ఎందులో అయినా వైరం త‌ప్ప‌నిస‌రి. ఇదిగో ఇక్క‌డ ఫ్యాష‌న్ ఫేసాఫ్ విష‌యంలో ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఒకే ఆలోచ‌న అగ్గి రాజేస్తోంది. ఎంపిక‌ల విష‌యంలో ఇద్ద‌రూ సేమ్ టు సేమ్ కావ‌డ‌తో పోటీ ప‌రాకాష్ట‌కు చేరుకుంటోంది.

ఈ రోజుల్లో అందాల క‌థానాయిక‌ల న‌డుమ‌ ఫ్యాషన్ ఫేస్-ఆఫ్స్ సర్వసాధారణం. ఈ జాబితాలో న‌వ‌త‌రం నాయిక‌లు రష్మిక మంద‌న .. అలియా భట్ ఉన్నారు. ఎస్.ఎస్.రాజమౌళి ఆర్.‌ఆర్.‌ఆర్ ‌లో రామ్ చరణ్ సరసన కనిపించనున్న అలియాతో రష్మిక మంద‌న పోలిక స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ర‌ష్మిక సౌత్ బ్యూటీనే అయినా ఉత్త‌రాది సోయ‌గం ఆలియాతో పోటీప‌డ‌డం విశేషం. స‌ద‌రు యంగ్ బ్యూటీస్ వేర్వేరు సందర్భాల్లో ఒకే దుస్తులు ధరించి కనిపించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రష్మిక అలియా కూడా ఒకే ఫ్యాషన్ రుచిని కలిగి ఉంటారని ప్రూవ్ అయ్యింది.

రష్మిక మండన్న ఇటీవల జిమ్మెర్మాన్ బ్రాండ్ దుస్తులు ధరించి ఆ ఫోటోని అభిమానుల‌తో పంచుకున్నారు. బెల్ స్లీవ్స్ ‌తో కూడిన ఫ్లోరిష్ దుస్తులను ధరించిన అనేక మంది నాయిక‌ల్లో ఒక భామ‌గా రికార్డుల‌కెక్కింది. ర‌ష్మిక ఓపెన్ హెయిర్.. మినిమల్ మేకప్ స్ట్రాప్ హీల్స్ తో తన లుక్ ప‌రంగా స్టైల్ ని ఎలివేట్ చేసింది.

అలియా భట్ 2018లో ఇదే త‌ర‌హా దుస్తులు ధరించి కనిపించింది. ఈ బ్యూటీ అందులో సూపర్ క్యూట్ గా కనిపించింది. తన బెస్ట్ ఫ్రెండ్ పుట్టినరోజు కోసం.. ఆలియా జిమ్మెర్మాన్ పాస్టెల్ పూల లేస్ దుస్తులను ఎంచుకుంది. ఇలా బెల్ స్లీవ్లు లోతైన V నెక్ లైన్ ఉన్నాయి. అలియా స్ట్రాప్ హీల్స్.. సింపుల్ మేకప్ .. క్రాస్ బాడీ స్లింగ్ స్టైల్ తో సింపుల్ గా క‌నిపిస్తోంది.

ఆ ఇద్ద‌రిలో ఎవ‌రు బెస్ట్ ఫ్యాష‌నిస్టా? అన్న‌దానికి అభిమానులే స‌మాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ర‌ష్మిక త‌దుప‌రి బ‌న్ని స‌ర‌స‌న పుష్ప చిత్రంలో న‌టిస్తోంది. ఆలియా వ‌ర‌స‌గా పాన్ ఇండియా సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది.