Begin typing your search above and press return to search.

రష్మిక మరో 'బంపర్ ఆఫర్' కొట్టేయనుందా..??

By:  Tupaki Desk   |   28 March 2021 6:00 AM IST
రష్మిక మరో బంపర్ ఆఫర్ కొట్టేయనుందా..??
X
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా 'మాస్టర్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు స్టార్ హీరో ఇళయదళపతి విజయ్. తమిళనాడు మినహా దేశవ్యాప్తంగా యాభైశాతం ఆక్యుపెన్సీతో విడుదల అయినప్పటికీ మాస్టర్ 250 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. విడుదలైన పదహారు రోజుల నుండి మాస్టర్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది. అయితే విజయ్ తదుపరి సినిమా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చేయనున్నాడు. దళపతి కెరీర్లో 65వ సినిమాగా రూపొందనున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించనుంది. అయితే ఈ సినిమాను ఏప్రిల్ నెలలో సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. గత కొంతకాలంగా ఈ సినిమాలో దళపతి సరసన హీరోయిన్ రేసులో పూజాహెగ్డే, రష్మిక మందనల పేర్లు బలంగా వినిపించాయి.

కానీ తాజాగా మేకర్స్ పూజాహెగ్డేను అధికారికంగా ఖరారు చేసేసారు. అయితే ఇదే సినిమాలో మరో హీరోయిన్ కు కూడా అవకాశం ఉన్నట్లు టాక్ నడుస్తుంది. అయితే అనుకున్నట్లుగానే మరో హీరోయిన్ క్యారెక్టర్ కోసం రష్మిక మందనను ఓకే చేయనున్నట్లు సమాచారం. మరి రెండవ హీరోయిన్ గా అయినా దళపతి సినిమాలో ఛాన్స్ అంటే మాములు విషయం కాదు. ఇప్పటికే రష్మిక వరుస సినిమాలతో తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటోంది. మరి విజయ్ సరసన రష్మిక కూడా కొత్తగానే ఉంటుంది. మరి ఇదేగనక నిజమైతే.. పుష్ప తరువాత రష్మిక మరో బంపర్ ఆఫర్ కొట్టేసినట్లే. ఈ విషయం పై మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. ఇటీవలే రష్మిక కార్తీతో సుల్తాన్ చేసింది. ఆమెకు సుల్తాన్ డెబ్యూ సినిమాకాగా ఏప్రిల్ 2న సినిమా విడుదల కాబోతుంది.