Begin typing your search above and press return to search.

మెగాపవర్ స్టార్ సరసన బన్నీ హీరోయిన్..!

By:  Tupaki Desk   |   16 April 2021 7:31 AM GMT
మెగాపవర్ స్టార్ సరసన బన్నీ హీరోయిన్..!
X
మెగాపవర్ స్టార్ రాంచరణ్ - స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా జులై 15న షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. అయితే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కనున్న సినిమా కాబట్టి ఈ సినిమాలో రాంచరణ్ పవర్ ఫుల్ రాజకీయనేతగా కనిపిస్తాడని టాక్. పలు కథనాల ప్రకారం.. ఈ సినిమాలో రాంచరణ్ ముఖ్యమంత్రి పాత్రలో నటించనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మించనున్నాడు. అయితే ఈ సినిమా శంకర్ తెరకెక్కించిన 'ఒకే ఒక్కడు' మూవీలా ఉండబోతుందని సినీవర్గాలు చెబుతున్నాయి.

ఇదిలా ఉండగా.. మొన్నటివరకు ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారనే చర్చలు నడిచాయి. పలువురు స్టార్ హీరోయిన్స్ పేర్లు వినిపించాయి కానీ ఏ ఒక్కరూ కన్ఫర్మ్ కాలేదు. తాజాగా డైరెక్టర్ శంకర్ యంగ్ బ్యూటీ రష్మిక మందనకు స్టోరీ వినిపించడం జరిగిందట. ఆ స్టోరీ నచ్చడంతో రష్మిక కూడా సానుకూలంగానే స్పందించిందట. కానీ ఇంకా కన్ఫర్మ్ గా చెప్పలేదని టాక్. ఒకవేళ రష్మిక ఓకే చేసి ఉంటే గనక ఈ విషయం పై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుందని సమాచారం. మరి ఈ సినిమా ఓకే అయితే మాత్రం రష్మిక కెరీర్లో మరో పాన్ ఇండియా మూవీ పడినట్లే. ఎందుకంటే ఆల్రెడీ ఈ బ్యూటీ పుష్ప సినిమాతో పాన్ ఇండియాకు పరిచయం కాబోతుంది. చూడాలి మరి ఏ కబురు వినిపిస్తుందో!