Begin typing your search above and press return to search.

తార‌క్- త్రివిక్ర‌మ్ చివ‌రికి ఆ హీరోయిన్ కే ఫిక్స్

By:  Tupaki Desk   |   21 March 2021 5:30 PM GMT
తార‌క్- త్రివిక్ర‌మ్ చివ‌రికి ఆ హీరోయిన్ కే ఫిక్స్
X
RRR లాంటి భారీ పాన్ ఇండియా చిత్రంలో న‌టిస్తున్న తార‌క్ త‌దుప‌రి త్రివిక్రమ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే నెల‌లో ఈ చిత్రం (NTR 30) ప్రారంభం కానుంది. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి చేసి తార‌క్ కోసం వేచి చూస్తున్నారు. ఇక యంగ్ య‌మ జ‌క్క‌న్న‌కు ఆర్.ఆర్.ఆర్ టీమ్ కి తార‌క్ భాయ్ చెప్పి రావాల్సి ఉంది.

మ‌రోవైపు తార‌క్ స‌ర‌స‌న క‌థానాయిక‌ను ఫైన‌ల్ చేసే ప‌నిలో త్రివిక్ర‌మ్ బిజీగా ఉన్నార‌ట‌. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఇందులో నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న‌ను క‌థానాయిక‌గా ఫైన‌ల్ చేశార‌ని తెలిసింది. ఇలియానా- స‌మంత‌- పూజా హెగ్డే లాంటి భామ‌ల‌ను కొత్త కోణంలో చూపించిన త్రివిక్ర‌మ్ ఇప్పుడు ర‌ష్మిక‌ను ఏ త‌ర‌హా పాత్ర‌లో ఆవిష్క‌రించ‌నున్నారు? అన్న‌ది ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

త్రివిక్ర‌మ్ త‌న సినిమాల్లో క‌థానాయిక‌ల పాత్ర‌ల‌కు ఇచ్చే ప్రాధాన్య‌త అంతా ఇంతా కాదు. ఏ కోణంలో చూసినా ర‌ష్మిక జాక్ పాట్ కొట్టింద‌నే చెప్పాలి. ఓ వైపు బ‌న్ని స‌ర‌స‌న పుష్ప చిత్రంలో న‌టిస్తూనే.. అటు బాలీవుడ్ లో అమితాబ్ తో క‌లిసి ఓ చిత్రంలో న‌టిస్తోంది. అలాగే మ‌రో భారీ వార్ మూవీలో బాలీవుడ్ క్రేజీ యువ‌హీరో స‌ర‌స‌న న‌టిస్తూ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగేస్తోంది ర‌ష్మిక‌.