Begin typing your search above and press return to search.

కొంప‌దీసి బాలీవుడ్ పిచ్చిలో ర‌ష్మిక అలా చేస్తోందా?

By:  Tupaki Desk   |   14 Dec 2020 10:42 AM IST
కొంప‌దీసి బాలీవుడ్ పిచ్చిలో ర‌ష్మిక అలా చేస్తోందా?
X
కెరీర్ ప్రారంభించిన చాలా త‌క్కువ స‌మ‌యంలోనే క్రేజీ నాయిక‌గా ఎదిగేసింది ర‌ష్మిక మంద‌న‌. వ‌రుస‌గా అగ్ర హీరోల స‌ర‌స‌న ఆఫ‌ర్లు కొట్టేస్తోంది. మ‌హేష్ స‌రిలేరు నీకెవ్వ‌రు త‌ర్వాత బ‌న్నితో పుష్ప చిత్రంలో అవ‌కాశం అందుకుంది. ఆ త‌ర్వాత ఎన్టీఆర్.. చ‌ర‌ణ్‌.. ప్ర‌భాస్ లాంటి స్టార్ల నుంచి అవ‌కాశాలు అందుకోనుంద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఇక ఇదే స్పీడ్ లో ఉండ‌గానే అటు హిందీ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌పైనా ర‌ష్మిక క‌న్నేసింద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు బాలీవుడ్ నుంచి ఆఫ‌ర్లు వ‌చ్చినా కాద‌నేసేది. కానీ ఇక‌పై అక్క‌డ అడుగు పెడితే త‌న‌దైన శైలిలో విజృంభించాల‌ని ఆలోచిస్తోంద‌ట‌. అందుక‌నుగుణంగా త‌న పాపులారిటీని పెంచుకునే ప‌నిలో ఉంది.

తాజా అప్‌డేట్ ప్రకారం పాపుల‌ర్ మ్యూజిక్ వీడియో కంపోజ‌ర్ అయిన‌ బాలీవుడ్ రాపర్ బాద్‌షాను రష్మిక సంప్రదించిందట‌. బాద్షా ఒక మ్యూజిక్ వీడియో చేయాలనుకున్నాడు. ప్ర‌ధాన డ్యాన్సింగ్ గాళ్ కావాల‌ని అనుకుంటున్నాడు. ఆ ఆఫ‌ర్ ర‌ష్మిక‌కే ఇచ్చేశాడ‌ట‌. ప్రస్తుతం దాని కోసం చండీగర్ లో షూటింగ్ లో బిజీగా ఉంది. 2020లో గూగుల్ లో ఎక్కువ‌గా శోధించిన యువ‌నాయిక‌గా ర‌ష్మిక‌కు రికార్డ్ ఉంది కాబ‌ట్టి తాజా సింగిల్ సాంగ్ తో మ‌రింత పాపుల‌ర్ కానుంద‌ని భావిస్తున్నారు. ఇప్పటి వరకు బాద్షా మ్యూజిక్ వీడియోలలో దక్షిణాది నుండి ఏ నటి కూడా కనిపించలేదు. ఇప్పుడు రష్మికకు అరుదైన ఛాన్స్ ద‌క్కింది. ఈ ఆఫ‌ర్ తో బాలీవుడ్ లోనూ ర‌ష్మిక పాపుల‌ర‌వుతుంది. అక్క‌డా ఛాన్సులు ప‌ట్టేస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. డియ‌ర్ కామ్రేడ్ హిందీ రీమేక్ ఆఫ‌ర్ కాద‌నుకున్నా..ఇక‌పై అక్క‌డా క్రేజీ ఆఫ‌ర్లు వ‌స్తే ర‌ష్మిక వ‌దులుకోద‌న్న‌మాట‌.