Begin typing your search above and press return to search.

రోమాన్స్.. పెళ్లయితే చేయకూడదా: రశ్మిక

By:  Tupaki Desk   |   30 July 2018 11:08 AM GMT
రోమాన్స్.. పెళ్లయితే చేయకూడదా: రశ్మిక
X
రష్మిక మందాన.. ఇప్పుడీ హీరోయిన్ పేరు మారుమోగిపోతోంది. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి తెలుగులోకి వచ్చిన ఈ బ్యూటీ ‘ఛలో’ మూవీతో ఇండస్ట్రీని ఆకట్టుకుంది. అంతకుముందు ‘కన్నడలో ‘కిరిక్ పార్టీ’ తో సినిమా కెరీర్ ఆరంభించింది. ఆ సినిమా కన్నడలో పెద్ద హిట్. ఆ చిత్రంలో నటించిన హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడి.. పెళ్లి కి కూడా ఓకే చెప్పేసింది. వీరిద్దరి ఎంగేజ్ మెంట్ కూడా తాజాగా పూర్తయ్యింది.

పెళ్లి కి సిద్ధమవుతూనే ఈ భామ పలు హీరోయిన్ చాన్సులు దక్కించుకుంది. తాజాగా రిలీజ్ కు సిద్ధమవుతున్న ‘గీతాగోవిందం’లో హీరోయిన్ గా లీడ్ రోల్ లో నటించింది. ఈ సినిమాలో హీరో విజయ్ ఆమెను వీపుపై ఎత్తుకొని మోసుకెళ్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. ఇది చూసిన కొందరు నెటిజన్లు కామెంట్ల దాడి మొదలుపెట్టారు. ‘పెళ్లికి సిద్ధమై నిశ్చితార్థానికి చేసుకొని ఇలా రోమాంటిక్ సీన్లు ఎలా చేస్తున్నావంటూ’ అమెను కొందరు నెటిజన్లు కడిగేశారు.

ఈ కామెంట్లకు రష్మిక కూడా ఘాటుగానే సమాధానమిచ్చింది. ‘మగాళ్లు పెళ్లయ్యాక కూడా వేరే హీరోయిన్లతో ఆన్ స్క్రీన్ రోమాన్స్ చేస్తున్నారు. దానికి మీకు ఎలాంటి అభ్యంతరం ఉండడం లేదు. కానీ అదే ఓ హీరోయిన్ పెళ్లయ్యాక వేరే హీరోతో రోమాన్స్ చేస్తే మీరు తట్టుకోలేరు.. హీరోయిన్లపై మీకున్న గౌరవం ఇదేనా.? ఇదేం న్యాయం’ అంటూ సోషల్ మీడియాలో రష్మిక ఎదురు దాడి చేసింది. మేము మనుషులమే.. నెగెటివ్ కామెంట్లు పెట్టేవాళ్లలో వేరే వాళ్ల ఫ్యాన్సే ఎక్కువగా ఉన్నారు.. అలాంటి వాళ్లను నేను ఎంతమాత్రం లెక్కచేయను అంటూ రష్మిక మండిపడుతోంది.