Begin typing your search above and press return to search.

బార్బీ డాల్ లా మెరిసిపోతున్న శ్రీవల్లి..!

By:  Tupaki Desk   |   15 Dec 2022 3:36 AM GMT
బార్బీ డాల్ లా మెరిసిపోతున్న శ్రీవల్లి..!
X
కన్నడ పరిశ్రమ నుంచి వచ్చిన రష్మిక అక్కడ కిరిక్ పార్టీ మూవీతో క్రేజ్ తెచ్చుకోగా తెలుగులో ఛలో సినిమాతో కూడా సూపర్ ఎంట్రీ ఇచ్చింది. తనలోని టాలెంట్ స్టార్ ఛాన్సులు వచ్చేలా చేయగా అమ్మడి నటనతో ఆడియన్స్ ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. అనతికాలంలోనే స్టార్ క్రేజ్ తెచ్చుకున్న అందాల భామ రష్మిక సినిమాలతోనే కాదు సోషల్ మీడియాలో కూడా ఓ రేంజ్ లో సందడి చేస్తుంది. సౌత్ హీరోయినే అయినా ఫ్యాషన్ లో ట్రెండ్ ని ఫాలో అవుతూ అలరిస్తుంది అమ్మడు.

లేటెస్ట్ గా స్లీవ్ లెస్ గౌనుతో బార్బీ డాల్ లా మెరిసిపోతుంది అమ్మడు. ఆ గౌనులో తన అందాలతో ఆడియన్స్ కి ఫీవర్ తెప్పించేస్తుంది శ్రీవల్లి. లాస్ట్ ఇయర్ నటించిన పుష్ప సినిమా అమ్మడికి నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చింది. రష్మిక తన ఫాలోయింగ్ తో నేషనల్ క్రష్ గా కూడా మారింది. నేషనల్ లెవల్లో ప్రేక్షకులంతా ఆమె అందానికి ఫిదా అవుతున్నారు. ఈ ఏడాది బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చిన రష్మిక అక్కడ కూడా రాణిస్తుంది.

ఇక అమ్మడి సినిమాల విషయానికి వస్తే దళపతి విజయ్ వారసుడు రిలీజ్ కు రెడీ అవుతుంది. బాలీవుడ్ లో చేసిన మిషన్ మజ్ను కూడా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేశారు.

ఇక నెక్స్ట్ సినిమా యానిమల్ చేస్తున్న రష్మిక ఆ సినిమాపై బీభత్సమైన అంచనాలు పెంచేసుకుంది. అటు సౌత్ తో పాటు బాలీవుడ్ ఆఫర్లు కూడా ఈక్వల్ గా అందుకుంటున్న రష్మిక అక్కడ ఇక్కడ బ్యాలెన్స్ చేస్తూ వస్తుంది.

కెరీర్ లో సూపర్ ఫాం లో ఉన్న రష్మిక మీద వివాదాలు ఉన్నాయి. కన్నడ పరిశ్రమ ఆమెని బ్యాన్ చేయాలన్న ఊపు చేసింది. రిషబ్ శెట్టి కాంతార మూవీ పై రష్మిక ఎలాంటి స్పందన తెలియచేయలేదని ఆమెను టార్గెట్ చేశారు కన్నడ ఆడియన్స్.

అంతేకాదు కిరిక్ పార్టీ ఛాన్స్ ఇచ్చిన సంస్థ గురించి కూడా ఆమె తక్కువ చేసి మాట్లాడటం ఈ గొడవకు బలాన్ని ఇచ్చింది. అయితే కన్నడ పరిశ్రమ తన తల్లి లాంటిదని.. దాన్ని వదిలి పెట్టే ఛాన్సే లేదని గొడవకు ఫుల్ స్టాప్ పెట్టింది రష్మిక.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.