Begin typing your search above and press return to search.

మిర్ర‌ర్ సెల్ఫీతో మ‌తులు పోగొట్టిన ర‌ష్మిక‌

By:  Tupaki Desk   |   26 March 2022 8:46 AM IST
మిర్ర‌ర్ సెల్ఫీతో మ‌తులు పోగొట్టిన ర‌ష్మిక‌
X
టోన్డ్ బాడీ అనగానే పిక్చ‌ర్ ప‌ర్ఫెక్ట్ బ్యూటీ పూజా హెగ్డే.. ప్ర‌గ్య జైశ్వాల్.. జాన్వీ క‌పూర్.. అన‌న్య పాండే .. సారా అలీఖాన్ అంటూ కొన్ని పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే జాబితాలో చేరింది ర‌ష్మిక మంద‌న‌.

నేష‌న‌ల్ క్ర‌ష్ గా జాతీయ స్థాయి గుర్తింపు ద‌క్కించుకున్న ఈ బ్యూటీ ప్ర‌స్తుతం బాలీవుడ్ సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉంది. ఓవైపు సౌత్ లో టాప్ హీరోల స‌ర‌స‌న న‌టిస్తూనే ఉత్త‌రాదిన క్రేజీ ఆఫ‌ర్లను విడిచిపెట్ట‌డం లేదు. అదే స‌మ‌యంలో త‌న గ్లామ‌ర్ కంటెంట్ ని మిస్ కాకుండా చాలా జాగ్ర‌త్త పడుతోంది. ఇటీవ‌ల ర‌ష్మిక‌ ప‌బ్లిక్ అప్పియ‌రెన్స్ నిరంత‌రం యువత‌రంలో హాట్ టాపిక్ అవుతోంది. ముంబై ప‌రిశ్ర‌మ‌కు అనువుగా ఇప్ప‌టికే ర‌ష్మిక‌లో చాలా మార్పు లు క‌నిపిస్తుండ‌డం విశేషం.

తాజాగా మ‌రో అద్భుత‌మైన ఫోటోషూట్ తో మైండ్ బ్లాక్ చేసింది ర‌ష్మిక మంద‌న‌. పిక్చ‌ర్ ప‌ర్ఫెక్ట్ టోన్డ్ బాడీతో మంట‌లు పెట్టేసిందంటే అతిశ‌యోక్తి కాదు. ఇక దీనికోసం ర‌ష్మిక నిరంత‌రం రోజుకు 2 గంట‌ల పాటు హృతిక్ రోష‌న్ ని మించి శ్ర‌మిస్తోంద‌ట‌. టోన్డ్ బాడీ ఆరు ప‌ల‌క‌ల కోస‌మే ఈ శ్ర‌మంతా అని తాజా ఫోటో చూడ‌గానే యూత్ కి అర్థ‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. నేటితో రష్మిక మందన్న సౌత్ లోని ఫిటెస్ట్ నటీమణులలో ఒకరిగా ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది.

న‌ట‌వృత్తిలో నిల‌బ‌డాలంటే ఫిట్ గా ఉండాలి. ఆరోగ్యకరమైన అలవాట్లను అవలంబించాలి. స్వ‌యం శారీర‌క‌ శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వ‌డం అవ‌స‌రం. ఇవ‌న్నీ ర‌ష్మిక సోషల్ మీడియా పోస్ట్ లను ప‌రిశీలిస్తే చాలా స్పష్టంగా కనిపిస్తోంది.

రష్మిక కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ఇప్ప‌టికే ప‌లు భారీ చిత్రాల లైన‌ప్ ను కలిగి ఉంది. పుష్ప పాన్ ఇండియా స‌క్సెస్ సాధించ‌గా ఇప్పుడు పుష్ప 2తో మ‌రోసారి సంచ‌ల‌నాల‌కు తెర తీయ‌బోతోంది. బాలీవుడ్ లో వ‌రుస‌గా మూడు సినిమాల‌తో బిజీగా ఉంది. ఇంత‌గా షెడ్యూళ్ల ప‌రంగా డిమాండ్ ఉన్నా.. ప్ర‌తి రోజూ జిమ్ కి వెళ్లడంలో ర‌ష్మిక విఫలం కాదు. ఆమె ఈ రోజు తన ఇన్ స్టాగ్రామ్ కథనాలలో జిమ్ సెల్ఫీని పంచుకోగా వైర‌ల్ గా మారింది. రష్మిక మిర్రర్ సెల్ఫీతో క్లీన్ బౌల్డ్ చేసింద‌నే చెప్పాలి. ఇందులో తన యాబ్స్ సూపర్ టోన్ బ్యాక్ ను ప్రదర్శించింది.

ఈ చిత్రాన్ని పోస్ట్ చేయడానికి నాకు అనుమతి ఉందో లేదో నాకు తెలియదు...మీలో చాలామంది దీన్ని ఇష్టపడరు.. కానీ మీ ఫిట్ నెస్ లక్ష్యాలకు కీలకం CONSISTENCY తో పాటు వర్కవుట్ లు.. ఫిజియోలు.. .. మీ డైట్ తో పాటు అని చెప్పడానికి నేను ఈ కథనాన్ని పోస్ట్ చేస్తున్నాను అని ర‌ష్మిక తెలిపింది. మీ ఆలోచనలు.. మీ ప్రయాణంతో... స్థిరంగా ఉండండి.. దాన్ని ఆస్వాదించండి... ఇది కొంతకాలం సరదాగా ఉండదు... కానీ మీరు అలవాటు చేసుకున్నప్పుడు దీనిని గ్రహిస్తారు... నా ప్రేమను మీకు పంపుతున్నాను!! అంటూ సందేశాన్ని పంపింది.

లక్ష్యాలను సాధించడానికి పని చేస్తున్నప్పుడు స్థిరత్వం నిస్సందేహంగా అత్యంత ముఖ్యమైన అంశం..ఇది శాశ్వత ఫిట్ నెస్ కోసం రష్మిక అనుస‌రించిన రహస్యం అని భావించాలి. పుష్పతో ఉన్నత ప్రమాణాలను అందుకున్న ఈ బ్యూటీ ఈ సంవత్సరం రెండు ఉన్నత స్థాయి వెంచర్లతో బాలీవుడ్ లో కి కూడా దూసుకుపోతోంది. ఆమె శంతను బాగ్చి స్పై థ్రిల్లర్ మిషన్ మజ్నులో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి కనిపించనుంది. జూన్ 10న సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు.

అలాగే అమితాబ్ బచ్చన్ తో గుడ్ బై అనే పేరుతో వికాస్ బహ్ల్ రూపొందించిన మరో బి-టౌన్ చిత్రం కూడా సెట్స్ పై ఉంది. రష్మిక.. వరుణ్ ధావన్ స‌ర‌స‌న న‌టిస్తోంది. విజయ్ తో తలపతి66 లోనూ ఆఫ‌ర్ అందుకుంది. మసాలా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయాల్సి ఉంది. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నారు.