Begin typing your search above and press return to search.

ఆ విషయంలో గీతకు సపోర్ట్ ఇచ్చారట!!

By:  Tupaki Desk   |   25 Sept 2018 10:33 AM IST
ఆ విషయంలో గీతకు సపోర్ట్ ఇచ్చారట!!
X
తెలుగులో ఉన్న హీరోయిన్స్ లో క్రేజీ హీరోయిన్ ఎవరు అంటే తప్పనిసరిగా రష్మిక మందన్న పేరు చెప్పాల్సిందే. 'ఛలో'.. 'గీత గోవిందం' సినిమాలతో రష్మిక పాపులారిటీ ఇప్పుడు పీక్స్ లో ఉంది. మరో రెండు రోజుల్లో విడుదల కానున్న అక్కినేని నాగార్జున - నాని మల్టిస్టారర్ 'దేవదాస్' లో నానికి జోడీగా రష్మిక నటించింది. ఈ సినిమాను వైజయంతి మూవీస్ వారు నిర్మించిన విషయం తెలిసిందే. వైజయంతి బ్యానర్ లో పని చేయడం గురించి మాట్లాడుతూ రష్మిక నిర్మాతలకు థాంక్స్ చెప్పింది.

సినిమా షూటింగ్ సమయంలో తనకు స్కిన్ ఇష్యూస్ వచ్చాయట. కానీ అశ్విని దత్ గారు.. స్వప్న దత్ లు తనకు ఆ సమయంలో అండగా నిలబడ్డారని వాళ్ళ సపోర్ట్ లేకపోతే తన షూటింగ్ పోర్షన్ అంత సులువుగా పూర్తి చేయగలిగేదానిని కాదేమోనని తెలిపింది. అదే వేరే నిర్మాతలు కనుక అయితే అలాంటి సపోర్ట్ తనకు ఉండడం డౌట్ అని తెలిపింది. వాళ్ళకు థ్యాంక్స్ చెబుతూ వారి సపోర్ట్ కారణంగానే కంఫర్టబుల్ గా నటించానని చెప్పింది.

సహజంగా హీరోయిన్లు తమకు ఏవైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా.. చర్మసంబంధిత సమస్యలు ఉన్నా ఓపెన్ గా మాట్లాడరు. రష్మిక ఆ విషయం గురించి ఓపెన్ గా చెప్పడమే కాకుండా నిర్మాతలు తనకందించిన సహకారాన్ని కూడా బయటకు చెప్పడం విశేషమే.