Begin typing your search above and press return to search.

జర్నలిస్టు అవుదామని యాక్టర్ అయిన రష్మిక

By:  Tupaki Desk   |   2 May 2020 9:00 PM IST
జర్నలిస్టు అవుదామని యాక్టర్ అయిన రష్మిక
X
డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన చాలా మందిని చూశాం.. ఆ కోవలోనే జర్నలిస్టు అవుదామని ఆ చదువు కూడా చదివిన అమ్మాయి ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. అది ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండానే.. వింతగా ఉన్న ఇది అక్షరాల నిజం మరీ..

సినీ రంగాల్లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదగడం.. అవకాశాలు దక్కించుకోవడం.. వరుస విజయాలు సాధించడం అంత తేలికైన విషయం కాదు.. కానీ కన్నడ అందం రష్మిక మందన్నా ఈ చరిత్రను తిరగరాసింది. కొందరు నటులు ఇలా వెలుగులోకి వచ్చినా వారిని తొక్కేశారు. ఆత్మహత్యలు చేసుకున్నారు. బడా ఫ్యామిలీల నుంచి వారికి హీరో ఫేస్ లేకున్నా తండ్రులు, తాతల బ్యాక్ గ్రౌండ్ తో స్టార్లుగా నడిపించేస్తున్న పరిస్థితి..

రష్మిక మందన్నా అసలు ఈ స్థాయికి తెలుగు సినీ పరిశ్రమలో ఎదుగుతుందని అస్సలు అనుకోలేదట.. తోటి హీరోయిన్లు సైతం కుళ్లుకునేలా ఇమె వరుస విజయాలు సాధిస్తూ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదుగుతోంది.

అయితే నిజానికి రష్మిక హీరోయిన్ అవుదామని అస్సలు అనుకోలేదట.. ఆమె చదువుకు.. ఎంచుకున్న రంగానికి అస్సలు సంబంధమే లేదట..

తాజాగా రష్మిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చదివింది జర్నలిజం అయినా ఆ రంగం కన్నా సినీ రంగమే నన్ను ఎక్కువగా ఆకర్షించిందని తెలిపింది. నటన మీద ఆసక్తితో ఏ దారి లేక మోడలింగ్ చేశానంది. మోడల్ గా క్లిక్ అయ్యాక నాకు అవకాశాలు వచ్చాయని.. తొలి చిత్రమే విజయాన్ని అందుకున్నానని రష్మిక తెలిపింది. నా ముఖాన్ని గుర్తు పెట్టుకుంటారో లేదోనని భయపడ్డానని.. కానీ వరుసగా అవకాశాలు వచ్చి వేగంగా ఎదిగానన్నారు. వెంటనే ఆ క్రేజ్ పడిపోకూడదనే ప్రతీ చిత్రాన్ని చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నానని రష్మిక తెలిపారు.