Begin typing your search above and press return to search.

తెలుగు చమక్ లు ఆమెవి కాదంట

By:  Tupaki Desk   |   18 Jan 2018 11:30 PM GMT
తెలుగు చమక్ లు ఆమెవి కాదంట
X
కన్నడలో ఇప్పుడు ఫుల్ బూమ్ లో ఉన్న హీరోయిన్ రష్మిక మందన. కిరిక్ పార్టీ అంటూ అరంగేట్రంలోనే అదిరిపోయే సక్సెస్ సాధించింది రష్మిక. ఈ బ్యూటీని తెలుగులోకి తెచ్చేందుకు గట్టి ప్రయత్నాలే జరిగాయి. ఇప్పటివరకూ తెరపై ఈ భామ కనిపించకపోయినా.. త్వరలో ఛలో అంటూ నాగశౌర్యతో కలిసి అలరించబోతోంది ఈ బ్యూటీ.

గతేడాది రష్మిక నటించిన శాండల్ వుడ్ మూవీ చమక్ రిలీజ్ అయింది.. సూపర్ సక్సెస్ సాధించింది. కిరిక్ పార్టీని తెలుగులో కిరాక్ పార్టీగా తెస్తున్న మాదిరిగానే.. ఈ చమక్ ను కూడా రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే.. ఈ తెలుగు రీమేక్ లో తాను నటించబోవడం లేదని తేల్చేసింది రష్మిక. అంతే కాదు.. రామ్ కు హీరోయిన్ గా నటించేందుకు ఓ సినిమా యాక్సెప్ట్ చేసిందని వచ్చిన వార్తలు కూడా రూమర్ మాత్రమే అని చెప్పేసింది రష్మిక. తన సినిమాల విషయంలో బాగా ఓపెన్ గా ఉంటానని చెబుతున్న ఈ భామ.. రూమర్స్ ను పట్టించుకోనని అంటోంది. ఒకసారి చేసిన సినిమాను.. మరో భాషలో రీమేక్ చేసినపుడు యాక్ట్ చేయడం తనకు అంతగా నచ్చదని అంటోంది రష్మిక.

ఫిబ్రవరి 2న విడుదల కానున్న ఛలో.. ఆంధ్ర-కర్నాటక బోర్డర్ లో ఉన్నట్లుగా సృష్టించిన ఓ టౌన్ బ్యాక్ డ్రాప్ తో సాగుతుందట. నాగశౌర్యతో ఛలో చిత్రం తర్వాత.. విజయ్ దేవరకొండకు హీరోయిన్ గా తెలుగులో ఓ మూవీ చేస్తోంది రష్మిక మందన. పరశురామ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ-రష్మిక మందన జంటగా నటించబోతున్నారు.