Begin typing your search above and press return to search.

ఎంగేజ్మెంట్ అయ్యాక ఆమె దశ తిరిగింది

By:  Tupaki Desk   |   2 Jan 2018 2:30 AM GMT
ఎంగేజ్మెంట్ అయ్యాక ఆమె దశ తిరిగింది
X
చాలాసార్లు మనం చూసేది వినేది ఏంటంటే.. పెళ్ళయిన హీరోయిన్లకు పెద్దగా క్రేజ్ ఉండదు. వారికి నిజంగా క్రేజ్ ఉండదా అంటే.. మనోళ్లు క్యాస్టింగ్ చేయకపోవడం వలనే క్రేజ్ పడిపోతుందని కొందరి ఉవాచ. ఏదేమైనా కూడా టాలీవుడ్ మాత్రం పెళ్ళయిపోయిన హీరోయిన్లను అస్సలు పట్టించుకోదు. కాని ఇప్పుడు ట్రెండ్ మారుతున్న వేళ.. కొందరు హీరోయిన్లు కొత్త రాతను రాస్తున్నారు.

అందరూ ఆ మాట చెప్పగానే సమంత గురించి అనుకుంటారేమో కాని.. కాదండోయ్. నిజానికి ఇప్పుడు ఒక కన్నడ బ్యూటి గురించి మనం చెప్పుకోవాలి. ఆమె పేరు రష్మిక మందన్నా. అమ్మడు కన్నడలో కిరాక్ పార్టీ సినిమాతో ఫేమస్ అయ్యింది. అంతే కాదు.. ఆ సినిమా నటుడు ప్రొడ్యూసర్ రైటర్ అయిన రక్షిత్ శెట్టి ప్రేమలో పడి.. అతగాడితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. కాని విషయం ఏంటంటే.. ఎంగేజ్మెంట్ అయ్యాక అమ్మడు వరుసగా తెగ సినిమాలను సైన్ చేస్తోంది. అది కూడా హ్యాపెనింగ్ హీరోలతో అటు కన్నడలో ఇటు తెలుగులో చేసేస్తోంది.

తెలుగులో చూసుకుంటే.. అమ్మడు నాగ శౌర్య ఛలో.. విజయ్ దేవరకొండ- పరశురామ్ సినిమా.. అలాగే దిల్ రాజు ప్రొడక్షన్లో వస్తున్న రామ్ కొత్త సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మొన్ననే కన్నడలో పవర్ స్టార్ పునీల్ రాజ్ కుమార్ పక్కన అంజనీపుత్ర సినిమా చేశాక.. ఇప్పుడు కొత్త ఆఫర్లు కూడా తెగ వస్తున్నాయట. ఆ సినిమాలో కాస్త గ్లామరసం కూడా దారబోసింది రష్మిక. సో ఎంగేజ్మెంట్ అయ్యాకనే ఇన్నేసి సినిమాలు చేయడం ఇప్పుడు టాలీవుడ్ లో అలాగే మొత్తం సౌత్ లోనే పెద్ద టాపిక్ అయ్యింది.