Begin typing your search above and press return to search.

న‌ల్ల కోక‌లో గుబులు రేపిన శ్రీ‌వ‌ల్లి

By:  Tupaki Desk   |   13 Dec 2021 11:35 AM IST
న‌ల్ల కోక‌లో గుబులు రేపిన శ్రీ‌వ‌ల్లి
X
ర‌ష్మిక మంద‌న బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్నా నిన్నటి సాయంత్రం `పుష్ప: ది రైజ్` ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో సంద‌డి చేసింది. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ - రష్మిక మందన్న జంట ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. ఇక న‌ల్ల కోక‌లో ర‌ష్మిక ఎంట్రీ ఇచ్చిన తీరు మైండ్ బ్లాక్ చేసింద‌నే చెప్పాలి.

బ్లాక్ లో తన అందమైన శరీరాకృతిని అంతే ఆక‌ర్ష‌ణీయంగా ప్ర‌ద‌ర్శించింది ర‌ష్మిక‌. రష్మిక బ్లాక్ డ్రెస్ లో చాలా అందంగా కనిపించింది. ఈ లుక్ ర‌ష్మిక అందాన్ని మరింత పెంచింది. పుష్ప: ది రైజ్ లో రష్మిక డీగ్లామ్ లుక్ లో నటిస్తోంది. శ్రీ‌వ‌ల్లి త‌న పాత్ర పేరు. పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17న థియేట్రికల్ విడుదలవుతోంది. తెలుగు-త‌మిళం-హిందీ-మ‌ల‌యాళం-క‌న్న‌డ‌లో ఈ చిత్రం విడుద‌ల‌వుతోంది.

ర‌ష్మిక మ‌రోవైపు బాలీవుడ్ లో వ‌రుస చిత్రాల్లో న‌టిస్తోంది. అమితాబ్ గుడ్ బాయ్ లో అలాగే సిద్ధార్థ్ మ‌ల్హోత్రా మిష‌న్ మ‌జ్ను చిత్రంలో ర‌ష్మిక న‌టిస్తూ బిజీగా ఉంది