Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: పొట్టి నిక్క‌రుతో న‌ట‌వార‌సురాళ్ల‌కు చుక్క‌లు చూపిస్తోంది!

By:  Tupaki Desk   |   3 April 2021 4:30 AM GMT
ఫోటో స్టోరి: పొట్టి నిక్క‌రుతో న‌ట‌వార‌సురాళ్ల‌కు చుక్క‌లు చూపిస్తోంది!
X
రోమ్ వెళితే రోమ‌న్ లా ఉండాల‌ని ఒక సామెత‌. చూస్తుండగానే ర‌ష్మిక విష‌యంలో ప్ర‌తిదీ మారిపోతోంది. ఇప్ప‌టికే పెద్ద స్టార్ గా ఎదిగేసింది. టాలీవుడ్ లో వ‌రుస‌గా స్టార్ హీరోల సినిమాల‌కు మాత్ర‌మే క‌మిట‌వుతోంది. అలాగే బాలీవుడ్ లోనూ అడుగు పెట్టేస్తోంది. ఆరంగేట్ర‌మే అమితాబ్ లాంటి పెద్ద స్టార్ సినిమాలో న‌టించేస్తూ సంచ‌ల‌నంగా మారింది.

అయితే ముంబై కి వెళితే అక్క‌డ క‌ల్చ‌ర్ నే ఫాలో కావాల్సి ఉంటుంది. అలా కుద‌ర‌క‌పోతే సౌత్ నార్త్ అంటూ డివైడ్ ఫ్యాక్ట‌ర్ ఇబ్బందిక‌రంగా మారుతుంది. అందుకే ఇప్పుడు ర‌ష్మిక కూడా ముంబై వీధుల్లో చిట్టి పొట్టి నిక్క‌ర్ల‌తో క‌నిపిస్తోంది. ఇండ‌స్ట్రీని ఏలే న‌ట‌వార‌సురాళ్ల‌కు ధీటుగా ప్ర‌త్య‌క్ష‌మై స‌ర్ ప్రైజ్ చేసింది.

తాజాగా ర‌ష్మిక డెనిమ్ షార్ట్ .. వైట్ ష‌ర్ట్ ధ‌రించి అల్ట్రా స్టైలిష్ గా ముంబై వీధుల్లో షికార్ చేస్తూ క‌నిపించింది. పొట్టి నిక్క‌రు మీదుగా లాంగ్ వైట్ ష‌ర్ట్ ధ‌రించిన ర‌ష్మిక కాంబినేష‌న్ గా బ్లాక్ మాస్క్ స్టైలిష్ బ్రౌన్ గాగుల్స్ తో క‌నిపించింది. మొత్తానికి పెద్ద స్కెచ్ తోనే ముంబైలో అడుగుపెట్టింద‌ని.. సంద‌ర్భాన్ని బ‌ట్టి ఫాలో అయిపోతోంద‌ని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.