Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: అలా న‌వ్వి బిస్కెట్ వేసిన ర‌ష్మిక‌

By:  Tupaki Desk   |   22 March 2021 5:31 AM GMT
ఫోటో స్టోరి: అలా న‌వ్వి బిస్కెట్ వేసిన ర‌ష్మిక‌
X
అంద‌మైన న‌వ్వు ఓ వ‌రం .. అది అంద‌రికీ ఉండ‌దు. కొంద‌రికి మాత్ర‌మే ఉంటుంది. అలాంటి అంద‌మైన న‌వ్వు చంద‌మామ కాజల్ లో చూశాం. ఆ త‌ర్వాత ఇదిగో ర‌ష్మిక‌కే కుదిరింది. అందుకేనేమో.. కెరీర్ ప్రారంభించిన చాలా తక్కువ స‌మ‌యంలో చంద‌మామ అంత ఎత్తుకు ఎదిగేసింది. స్టార్ హీరోయిన్ గా ర‌ష్మిక మంద‌న‌కు ఇప్పుడు ఎదురే లేదు.

ఇప్ప‌టివ‌ర‌కూ సంత‌కాలు చేసిన‌వ‌న్నీ కేవ‌లం అగ్ర హీరోల సినిమాలు మాత్ర‌మే. మ‌హేష్ తో స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంలో న‌టించాక .. వ‌రుస‌గా బ‌న్ని.. ఎన్టీఆర్ సినిమాల‌కు సంత‌కాలు చేసింది. బ‌న్నితో పుష్ప చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొన్న ర‌ష్మిక త‌దుప‌రి తార‌క్ - త్రివిక్ర‌మ్ జోడీతో సెట్స్ కెళ్ల‌నుంది. చ‌ర‌ణ్ తోనూ త‌దుప‌రి సినిమాలో ఈ భామ న‌టించ‌నుంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. అటుపైనా ఇక్క‌డ అగ్ర హీరోల్లో డార్లింగ్ ప్ర‌భాస్ మాత్ర‌మే పెండింగ్. ఆ ఒక్క ఛాన్స్ కి కూడా ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌క‌పోవ‌చ్చు.

నేష‌న‌ల్ క్ర‌ష్ అంటూ జాతీయ మీడియాలే పొగిడేశాక రష్మిక ఆగుతుందా? ఇప్పుడు ఏకంగా బిగ్ బి అమితాబ్ సినిమాలోనే న‌టిస్తోంది. ఇక ఇదే దూకుడులో సోష‌ల్ మీడియాల్లో అసాధార‌ణంగా ఫాలోయింగ్ పెంచుకుంటోంది. నిరంత‌రం ఏదో ఒక స్పెష‌ల్ ఫోటోగ్రాఫ్ ని ఇన్ స్టాలో షేర్ చేస్తూ అభిమానుల్ని టీజ్ చేస్తోంది.

తాజాగా ర‌ష్మిక ఎంతో బ్యూటిఫుల్ గా న‌వ్వుతున్న ఫోటోని షేర్ చేసింది. అంత అంద‌మైన ఆ న‌వ్వుకు ప‌డిపోనిది ఎవ‌రు? సింపుల్ గా న‌వ్వేస్తూ కుర్రాళ్ల హృద‌యాల్ని దోచేయ‌డం ర‌ష్మిక‌కు తెలిసినంత‌గా వేరొక‌రికి తెలీదేమో!! ఆ వైట్ డిజైన‌ర్ దుస్తుల్లో అంతే అంద‌గా క‌నిపిస్తోంది. మీరే నా ఈ న‌వ్వుకు కార‌ణం.. అనేస్తూ బిస్కెట్ వేస్తోంది.