Begin typing your search above and press return to search.
టాలీవుడ్ బాలీవుడ్ సరే.. ఇక హాలీవుడ్ కెళుతుందా?
By: Tupaki Desk | 2 March 2022 6:00 AM ISTచూస్తుండగానే ప్రియాంక చోప్రా బాలీవుడ్ అగ్ర హీరోయిన్ గా ఎదిగింది. అందాల రాణిగా కిరీటం దక్కించుకుని ప్రపంచ సుందరి హోదాతో నటిగా ఆరంగేట్రం చేసి అటుపై ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని అంచెలంచెలుగా నిరూపించుకుని చివరికి ముంబై పరిశ్రమ అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి అటుపై హాలీవుడ్ కి కూడా వెళ్లి అక్కడ సత్తా చాటి చివరికి నిక్ జోనాస్ ని పెళ్లాడి అమెరికా కోడలిగా హాలీవుడ్ స్టార్ గా కొనసాగుతూ పీసీ సాగించిన హవా అంతా ఇంతా కాదు.
చూస్తుంటే రష్మిక లైన్ అలాగే వెళుతున్నట్టు కనిపిస్తోంది సుమీ! అసలు ఈ కన్నడ బ్యూటీ దూకుడును నిలవరించడం ఎవరి వల్లా కావడం లేదు. ఛలో చిత్రంతో హిట్టు కొట్టి నాలుగేళ్లలోనే టాలీవుడ్ అగ్ర హీరోలందరి సరసనా నటించేస్తూ ఇండస్ట్రీ టాప్ హీరోయిన్ అయిపోయింది.
పుష్ప చిత్రంతో ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ గా వెలిగిపోతోంది. ఇప్పటికిప్పుడు బాలీవుడ్ లో వరుస చిత్రాల్లో నటిస్తూ సత్తా చాటే ప్రయత్నంలో ఉంది. తన సన్నివేశం చూస్తుంటే వరుసగా పాన్ ఇండియా చిత్రాలకు కమిటవ్వాలనే తపనలో ఉన్నట్టే కనిపిస్తోంది.
బాలీవుడ్ లో ప్రస్తుతం ఆమె చేతిలో మిషన్ మజ్ను- గుడ్‌బై అనే రెండు హిందీ చిత్రాలు చేస్తోంది ఈ బ్యూటీ. నిజానికి సౌత్ ఇండియన్ హీరోయిన్లకు బాలీవుడ్ లో పెద్దగా ఆఫర్లు రావు. కానీ రష్మికకి వరస ఆఫర్లు దక్కుతున్నాయి. దీనిపై తాజా ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ..``మనం సరైన సినిమా చేసినప్పుడు మన గురించి ప్రేక్షకులు సరైన అనుభూతి చెందుతారు. నేను కూడా అంతే. అప్పుడే ఏదైనా వర్కవుట్ అవుతుంది..`` అని గడుసైన సమాధానమిచ్చింది.
తనకు సౌత్ ఇండియన్ సినిమాలు ఉత్తర భారతదేశంలో విస్తృత ఖ్యాతిని తెచ్చిపెట్టాయని చెప్పింది. ప్రస్తుతం ఉత్తరాది ప్రజలు తనను శ్రీవల్లి (పుష్ప)... గీత (గీత గోవిందం) వంటి పాత్రల పేర్లతో పిలుస్తున్నారని తెలిపింది. తనకు ఇతర పరిశ్రమలే బాలీవుడ్ అని అంటోంది రష్మిక. ప్రభావవంతమైన పాత్రలు చేయడానికి నా బెస్ట్ ను అందించడానికి నేను ఎదురుచూస్తున్నాను.
భాష ఎప్పుడూ అడ్డంకి కాదు ఎందుకంటే నేను ఎప్పుడూ వివిధ భాషలలో పాత్రలు చేయడాన్ని ఆనందించాను... అని తెలిపింది. తనను నార్త్ నటి లేదా సౌత్ నటి అని ట్యాగ్ చేయకూడదని రష్మిక పేర్కొంది. ఆమె పాన్-ఇండియా నటి కావాలనుకుంటోందిట.
`ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రంలో రష్మిక నాయిక. శర్వా కథానాయకుడిగా నటించిన ఈ చిఇత్రం మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. పుష్ప 2లోనూ రష్మిక మందన కథానాయికగా నటించనున్న సంగతి తెలిసిందే. చూస్తుంటే శాండల్ వుడ్ టు టాలీవుడ్ ఇట్నుంచి బాలీవుడ్ వెళ్లింది. ఇక హాలీవుడ్ ఒక్కటే పెండింగ్. రష్మిక జోరు చూస్తుంటే హాలీవుడ్ ఆఫర్ ని కాదనేట్టు లేదు.