Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్‌ : కలర్ తో అవసరం లేని కవ్వింపు

By:  Tupaki Desk   |   27 Jun 2021 9:30 AM GMT
పిక్‌ టాక్‌ : కలర్ తో అవసరం లేని కవ్వింపు
X
టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ రష్మిక మందన్నా సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా ఫొటో షూట్‌ లను షేర్‌ చేస్తూ ఉంటుంది. కాని అందులో కొన్ని మాత్రం చాలా ప్రత్యేకంగా నిలుస్తూ ఉంటాయి. ఆ ప్రత్యేక ఫొటోల్లో ఈ ఫొటో నిలుస్తుందని చెప్పుకోవచ్చు. రష్మిక ఫేస్‌ సగం కవర్‌ చేయడంతో పాటు బ్లాక్ అండ్‌ వైట్‌ లో ఈ ఫొటోను షేర్‌ చేసింది. సమ్‌ థింగ్‌ ఎబౌట్‌ బ్లాక్ అండ్‌ వైట్ పిక్చర్‌ అంటూ ఈ ఫొటోకు ఆమె కామెంట్‌ పెట్టింది. ఆమె చూడ్డానికి ఈ ఫొటోలో చాలా సెక్సీగా ఉంది. కొందరి చూపులతో ఎక్స్‌ ప్రెషన్స్‌ ను కనబర్చుతారు అంటారు. ఇప్పుడు అదే తీరు రష్మిక ఫేస్ లో ఉంది.

ఆమె కళ్లలో మత్తు కవ్విస్తూ ఉంది. ఆమె చూపుతోనే మత్తెక్కించేలా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అద్బుతమైన మీ అందం ఏ కలర్‌ లో అయినా ఆకట్టుకుంటుంది. దాని గురించి ఎలాంటి అనుమానం సందేహం లేదు. మీరు అందంలో అద్బుతం అంటూ అభిమానులు ఫొటోకు కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక ఈ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటో నెట్టింట ట్రెండ్‌ అవుతోంది.

ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే పుష్ప సినిమాలో నటిస్తోంది. అంతే కాకుండా నాని తో ఒక సినిమాలో నటించేందుకు ఈమె ఓకే చెప్పిందనే వార్తలు వచ్చాయి. ఇక తెలుగులో మరో రెండు సినిమాలు కూడా చర్చలు జరుగుతున్నాయి. హిందీలో రెండు సినిమాలు తమిళంలో ఒక సినిమా కన్నడంలో ఒకటి రెండు సినిమాలను ఈమె చేస్తుందట.