Begin typing your search above and press return to search.

ఛలో బ్యుటీకే పట్టం కట్టేశారు!!

By:  Tupaki Desk   |   3 March 2018 5:27 PM IST
ఛలో బ్యుటీకే పట్టం కట్టేశారు!!
X
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ అంటూ.. ఏటేటా క్రేజీ భామలతో జాబితాను తయారు చేస్తుంటారు. ప్రతీ మెట్రోపాలిటన్ సిటీలోను ఇలా కాంపిటీషన్స్ నిర్వహిస్తూ.. కొంతమందితో జాబితా రూపొందించి.. ఆన్ లైన్ పోల్ నిర్వహించి.. జాబితాగా ప్రకటించడం ఆనవాయితీ.

ఈ సారి టైమ్స్ ఇలా నిర్వహించిన రేస్ లో మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ లిస్ట్ లో బెంగళూరు టైమ్స్ కు గాను.. ఛలో బ్యూటీ రష్మిక మందన టాప్ ప్లేస్ లో నిలిచినట్లు ప్రకటించింది. గతేడాది మొత్తం ఈమె హంగామా కన్నడనాట విపరీతంగా సాగింది. మొదట కిరాక్ పార్టీతో హల్ చల్ చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ఆరునెలల్లో అంజనీపుత్ర.. చమక్ చిత్రాలతో చమక్కులు చూపించింది. దీంతో బెంగళూరు వాసుల్లో మెజారిటీ భాగం రష్మికకే ఓట్లు గుద్దేశారు. అలా 2017కు మోస్ట్ డిజైరబుల్ ఉమన్ జాబితాలో రష్మికకు ఫస్ట్ ప్లేస్ దక్కేసింది. ఈమెతో పాటు మొత్తం 30 మంది మహిళలు ఈ జాబితాలో ఉన్నారు.

వీరిలో మనకు తెలిసిన భామలు కూడా కొందరు ఉన్నారు. తెలుగు నుంచి కన్నడకు షిఫ్ట్ అయిన కృతి కర్బందా.. సెకండ్ ప్లేస్ లో నిలిచింది. క్షణం మూవీ తీసిన రవికాంత్ పెరెపు దర్శకత్వంలో మూవీ చేస్తున్న శ్రద్ధా శ్రీనాథ్.. ఐదవ స్థానంలో నిలిచింది. లవ్లీ మూవీతో అలరించి శాండల్ వుడ్ కి తన అడ్డా మార్చేసిన శాన్వి శ్రీవాస్తవ.. మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ జాబితాలో 7 వస్థానంలో ఉంది. కిరాక్ పార్టీ అంటూ వస్తున్న సంయుక్తా హెగ్డే.. 9వ ప్లేస్ ను పొందడం విశేషం.