Begin typing your search above and press return to search.
తనకు బ్రేకిచ్చిన సంస్థకే కళ్లు భైర్లు కమ్మేలా..!
By: Tupaki Desk | 27 Feb 2022 4:07 PM IST`కోటి పారితోషికం` అన్న పదం వినేందుకే ఎంతో బరువుగా ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి కోటి పారితోషికం అందుకునేందుకు దశాబ్ధం పైగానే హీరోగా అలుపెరగకుండా శ్రమించాల్సొచ్చింది. కానీ ఇప్పటితరం కథానాయికలు ఇలా నాలుగైదేళ్లలోనే అవలీలగా కోటి పారితోషికం అందుకుంటున్నారు.
కోటి అంటే ఖాతరు చేసే పరిస్థితి లేదు ఇప్పుడు. ఇక పరిశ్రమకు పరిచయమైన నాలుగేళ్లకే కోటి పైగా పారితోషికం అందుకుంటున్న రష్మిక మందన వరుస బ్లాక్ బస్టర్లతో లక్కీ ఛామ్ గా మారడంతో ఇక తన డిమాండ్లకు హద్దు అన్నదే లేకుండా పోయిందని టాక్ వినిపిస్తోంది.
ఇటీవలి పుష్ప - ది రైజ్ తెలుగు-హిందీలో బ్లాక్ బస్టర్ కొట్టడంతో రష్మిక తన రేంజును అమాంతం పెంచేసిందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ముంబై పరిశ్రమలో వరుసగా మూడు నాలుగు చిత్రాలు చేస్తోంది. మరోవైపు టాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ సినిమాలు చేసేస్తోంది.
అందుకే ఇప్పుడు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే పనిలో ఉంది. ఇప్పటికిప్పుడు ఎవరైనా తెలుగు నిర్మాత కనిపిస్తే రూ.2కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తోందట. ఆ ఫిగర్ వినగానే నిర్మాత నీళ్లు నములుతున్నాడని తెలుస్తోంది.
రష్మిక మందన్న తన రెమ్యునరేషన్ ని అమాంతం పెంచేసింది. లక్షల్లో అందుకునే ఈ బ్యూటీ ఉన్నట్టుండి కోటికి ఎగబాకి ఇప్పుడు ఏకంగ 2కోట్లు అడిగేస్తోంది. పుష్ప సక్సెస్ కిక్కు ఇది! అంటూ గుసగుసలు వైరల్ గా స్ప్రెడ్ అవుతున్నాయి. ఇప్పటికే పుష్ప సీక్వెల్ కోసం 2కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట. ఇతర నిర్మాతల నుండి కూడా అదే ఆశిస్తోందట. ప్రఖ్యాత గీతా ఆర్ట్స్ నాయికా ప్రధాన చిత్రానికి సన్నాహాలు చేస్తూ రష్మికను సంప్రదించగా.. భారీ పారితోషికం అడిగిందని తెలిసింది.
నిజానికి గీత గోవిందం తో తన రేంజును పెంచింది గీతా సంస్థనే. అయినా కానీ పారితోషికంలో రూపాయి తగ్గేదే లేదని చెబుతోందట. నిర్మాతల నుంచి జీఎస్టీతో పాటు రూ.2 కోట్లు అడిగినట్లు సమాచారం. ఈ చిత్రానికి చిలసౌ-మన్మధుడు 2 చిత్రాలకు దర్శకత్వం వహించిన రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించనున్నారు.
ఇప్పటికి ఇంకా రష్మిక ఈ మూవీకి సంతకం చేయలేదు. పుష్ప 2 తర్వాత ఏ సినిమా చేస్తోందో వివరాల్ని వెల్లడించలేదు. అటు హిందీ కమిట్ మెంట్లు పూర్తయితే కానీ ఏదీ చెప్పలేని స్థితిలో ఉందనుకోవాలి. బిగ్ బ్రేకిచ్చిన సంస్థకే కళ్లు భైర్లు కమ్మే ట్రీట్ ఇస్తోంది ప్రస్తుతానికి.