Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: స్నేహ‌కు చెల్లిలా ఉందే?!

By:  Tupaki Desk   |   24 Aug 2018 1:32 PM GMT
ఫోటో స్టోరీ: స్నేహ‌కు చెల్లిలా ఉందే?!
X
చారెడేసి క‌ళ్లు.. చంద్ర‌బింబ‌మంటి మోము.. అర్థ‌చంద్రాకార క‌నుబొమ‌లు.. ముసిముసి న‌వ్వులు.. మెడ నిండా బంగారు న‌గ‌లు - న‌డుముకు వ‌డ్డానం.. ప‌ట్టు చీర‌-ర‌వికెలో త‌ళ‌త‌ళ‌లాడుతున్న ఈ భామ ఎవ‌రు? కంచిప‌ట్టులో కాంచ‌న‌మాల‌లా మెరిసిపోతోంది. స్నేహ‌కు చెల్లెలి వ‌రుసా? చ‌ంద‌మామ కాజ‌ల్ తాలూకానా? శ్రీ‌దేవికి దూర‌పు బంధువా? అంటూ ఆరాలు తీస్తున్నారా? అయితే మ‌రీ అంత‌గా ఆరా అవ‌స‌రం లేదులెండి. ఈ భామ అంద‌రికీ తెలిసిన వ‌య్యారి వ‌గ‌ల‌మారి గీత అలియాస్ ర‌శ్మిక మంద‌న‌.

న‌టించిన మూడు సినిమాలు బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్. క‌న్న‌డ కిర్రాక్ పార్టీ అక్క‌డ త‌న‌కు అద్భుత‌మైన పాలోయింగ్‌ ని తెచ్చిపెడితే - అటుపై నాగ‌శౌర్య స‌ర‌స‌న న‌టించిన `ఛ‌లో` టాలీవుడ్ ఎంట్రీని ఈజీ చేసేసింది. ముసిముసి న‌వ్వుల‌తో మ‌న‌సుకు గాలం వేసేసే ఈ భామ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న `గీత‌గోవిందం` చిత్రంలో న‌టించింది. గోవిందుడి భ‌ర‌తం ప‌ట్టే గీత‌గా గొప్ప‌గా అభిన‌యించింది. ఒకే ఒక్క త‌ప్పు చేసి అబ్బాయిలు దొరికిపోతే అమ్మాయిలు ఇలా కూడా ఆడుకుంటారా? దేవుడోయ్‌! అని ద‌ణ్ణం పెట్టేస్తున్నారు యూత్‌. అంత గొప్ప కంచు క‌రుకు సాఫ్ట్‌ వేర్ గాళ్ పాత్ర‌లో ర‌శ్మిక మా గొప్ప‌గా అభిన‌యించింది.

అయితే సినిమాలో క‌నిపించిన‌దానికి పూర్తి భిన్నంగా బ‌య‌ట ఉంటాన‌ని చెప్పిన ర‌శ్మిక .. ఇదిగో ఇలా ప‌ట్టు చీర‌లో ఓ చోట పూజ‌లు పున‌స్కారాల‌తో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఒంటినిండా బంగారంతో క‌న‌క‌మ‌హాల‌క్ష్మికి చెల్లెమ్మ‌లా క‌నిపిస్తున్న ర‌శ్మిక గుండె కొల్ల‌గొడుతోంది. `ముగ్ధ‌` షోరూమ్ ప్రారంభోత్స‌వంలో ఈ భామ ఇలా ద‌ర్శ‌న‌మిచ్చింది. స్నేహ‌ - కాజ‌ల్‌ - త‌మ‌న్నా .. వీళ్ల రోజులు పోయాయ్‌. ఇప్పుడు ర‌శ్మిక డేస్ స్టార్ట‌య్యాయ‌న‌డానికి ఇదిగో ఇదే ఎగ్జాంపుల్‌.