Begin typing your search above and press return to search.

అందం అండ్ గ్లామర్.. నెక్ట్స్ సమంతేనా?

By:  Tupaki Desk   |   9 Feb 2018 5:30 PM GMT
అందం అండ్ గ్లామర్.. నెక్ట్స్ సమంతేనా?
X
టాలీవుడ్ లోకి హీరోయిన్స్ తెగ వచ్చేసి ట్యాలెంట్ చూపేస్తున్నారు. బాలీవుడ్ భామలు నిలబడలేకపోతున్నారు కానీ.. దక్షిణాదిలో ఇతర భాషల నుంచి వచ్చిన సుందరాంగులు మాత్రం బాగానే సెటిల్ అయిపోతున్నారు. రీసెంట్ గా ఛలో మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన రష్మిక మందనపై.. టాలీ ఫిలిం మేకర్స్ బాగానే హోప్స్ పెట్టేసుకున్నారు.

అందానికి అందం.. దానికి తోడు ప్రతిభ.. గ్లామర్ యాంగిల్ లో కూడా ఇరగదీసేస్తున్న రష్మిక.. మాంచి హిట్ తో ఎంట్రీ ఇవ్వడం.. మన జనాలకు బాగా కిక్ ఇచ్చేసింది. ఇప్పటికే ఈ సుందరాంగి దగ్గర రెండు సినిమాలు ఉండగా.. ఇప్పుడు మరో మూవీ యాడ్ అయింది. విజయ్ దేవరకొండతో రెండు సినిమాల్లో నటించనున్న ఈ బ్యూటీ.. నితిన్ పక్కన శ్రీనివాస కళ్యాణంలో కూడా ఛాన్స్ సంపాదించేసింది. ఛలో చిత్రంలో యాక్టింగ్ చూసి ఫైనల్ చేసుకున్నారట. అవకాశాలు అందుకోవడంలో ఇంత స్పీడ్ చూపిస్తున్న ఈ భామను చూసి.. మిగిలినవాళ్లు ముక్కున వేలేసుకుంటున్నారు.

టాలీవుడ్ నుంచి సమంత వెకేట్ చేయకపోయినా.. పెళ్లి కారణంగా టాప్ బ్యూటీ అనే ట్యాగ్ మాత్రం ఖాళీ అయింది. సమంత కూడా ఇప్పుడు ఆ బిరుదును పొందేందుకు మళ్లీ ప్రూవ్ చేసుకోవాల్సిన సిట్యుయేషన్ కి వచ్చింది. అందుకే రాబోయే కాలంలో కాబోయే సమంత ఎవరా అనే డిబేట్ ఎక్కువగానే జరుగుతుండగా.. ఇప్పుడు ఆ ప్లేస్ కి టఫ్ కాంపిటీషన్ ఇచ్చేందుకు రష్మిక మందన రెడీ అయిపోయింది.