Begin typing your search above and press return to search.

ఆ కన్నడ పిల్ల వెనకే బన్నీ కూడా

By:  Tupaki Desk   |   15 Jun 2017 11:30 AM GMT
ఆ కన్నడ పిల్ల వెనకే బన్నీ కూడా
X
తెలుగులో నటించడానికి బాలీవుడ్ హీరోయిన్లే కాదు.. మిగతా సౌత్ ఇండియా హిరోయిన్లు తెలుగులో నటించడానికి ఎప్పుడు రెడీగా ఉంటారు. తమిళ్లో స్టార్ హీరోయిన్లు అంతా మన తెలుగులో నటిస్తున్నవారే. అయితే కన్నడ ఇండస్ట్రి నుండి​ మాత్రం ​తక్కువ మంది వస్తారు. ఇప్పుడు ‘కిరిక్ పార్టీ’ అనే సినిమాతో కథానాయికగా పరిచయమై తొలి సినిమాతోనే స్టార్ ఇమేజ్ సంపాదించిన అమ్మాయి ‘రష్మిక మండన్నా’ తెలుగులో నటించడానికి ఆశక్తి చూపిస్తోంది.

ప్రభాస్ ‘సాహో’ సినిమాలో ఈ రష్మిక నటించవలిసి​ ​ఉంది. కానీ అది ఎందుకో కార్య రూపం దాల్చలేదు. ఒక మంచి ఛాన్స్ మిస్ అయ్యిందే అన్నుకున్న రష్మిక మండన్నాకు నాగశౌర్య సినిమాతో తెలుగులో నటించే ఛాన్స్ దొరుకింది. ఆ తరువాత రామ్ సినిమాలో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు మరో పెద్ద్ ప్రాజెక్టులో కథానాయికగా ఎంపిక చేస్తునట్లు తెలుస్తుంది. అల్లు అర్జున్ కొత్త సినిమా ‘నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా’లో రష్మిక కథానాయికగా నటించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. కథ వైవిద్యంగా ఉండటంతో హీరోయిన్ కొత్తగా ఉంటే బాగుంటుంది అని హీరో అండ్ డైరెక్టర్ వక్కంతం వంశీ.. రష్మికను ఎంపిక చేసుకునట్లు టాక్. మొదటి సినిమాతోనే ఆమె కనబరిచిన చలాకీ నటన ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం అని చెబుతున్నారు.

తాజాగా తన మొదటి సినిమా కొ స్టార్ అయన రక్షిత్‌ తో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకోబోతుంది ఈ కన్నడ బ్యూటి. సినిమా కన్నా ముందు రష్మిక మోడల్‌ గా పని చేసింది. కిరిక్ పార్టీ సినిమా విజయంతో తమిళ్ మలయాళం ఇప్పుడు తెలుగులో మంచి ఆఫర్లు వస్తున్నాయి ఈ కొత్త కన్నడ డ్రామా బ్యూటీకు. తెలుగులో అల్లు అర్జున్ పక్కన నటిస్తే ఇంకా ఇక్కడ కూడా స్టార్ అయ్యినట్లే!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/