Begin typing your search above and press return to search.

#పుష్ప‌.. బ‌న్నితో పోటీప‌డాల‌నే ఇంత‌ క‌సిగా శ్ర‌మిస్తోందా?

By:  Tupaki Desk   |   31 Oct 2020 2:40 PM IST
#పుష్ప‌.. బ‌న్నితో పోటీప‌డాల‌నే ఇంత‌ క‌సిగా శ్ర‌మిస్తోందా?
X
నేటిత‌రం నాయిక‌ల‌కు అందం ఆరోగ్యంపై శ్ర‌ద్ధ అంతా ఇంతా కాదు. తీరైన రూపంతో ఇత‌ర భామ‌ల‌కు పోటీనివ్వాల‌న్న త‌ప‌న మ‌రీ ఎక్కువ‌. ఇలియానా.. క‌రీనా.. దిశాప‌టానీ వీళ్లంతా బాలీవుడ్ లో ప‌ర్ఫెక్ట్ ఫిట్ లుక్ తో ఆక‌ట్టుకుంటుంటే ... ఇటీవ‌ల సౌత్ భామ‌లు ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. మునుప‌టిలా బొద్దుగా క‌నిపించేందుకు అస్స‌లు ఇష్ట‌ప‌డ‌డం లేదు. స్లిమ్ గా సంథింగ్ స్పెష‌ల్ గా క‌నిపించేందుకు నిరంత‌రం జిమ్ముల్లో శ్ర‌మిస్తున్నారు.

టాలీవుడ్ లో స‌మంత ఈ విష‌యంలో అంద‌రికంటే ఎంతో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇప్పుడు అదే బాట‌లో అందాల ర‌ష్మిక మంద‌న ఫిట్నెస్ గోల్స్ తో దూసుకుపోతోంది. వ‌రుస‌గా అగ్ర హీరోల ఆఫ‌ర్లు అందుకుంటున్న ఈ బ్యూటీ ఎందులోనే త‌గ్గ‌డం లేదు.

ఫిట్నెస్ కోసం రష్మిక మంద‌న్న క‌ఠోరంగానే శ్ర‌మిస్తోంది. తరచూ జిమ్ లో తన వర్కౌట్ల కు సంబంధించిన‌ అనేక ఫోటోలు.. వీడియోలను తన సోషల్ మీడియా పేజీలలో పోస్ట్ చేస్తోంది. తాజాగా ర‌ష్మిక షేర్ చేసిన ఓ ఇన్ స్టా వీడియో ఆమె అభిమానులను ఆశ్చర్యపరిచింది.

వీడియోలో రష్మిక మంద‌న్న జిమ్ ‌లో బరువులు ఎత్తుతూ హార్డ్ వ‌ర్క్ చేస్తోంది. అంత‌గా హెవీవెయిట్లను అప్రయత్నంగా అలా ఎత్తేస్తోంది. ర‌ష్మిక‌లో అంత‌ అపారమైన శక్తి ఉందా? అని ఆశ్చ‌ర్య‌పోయేలా చేస్తోంది ఈ వీడియో. అస‌లే అల్లు అర్జున్ లాంటి కండ‌ల హీరో స‌ర‌స‌న న‌టిస్తోంది. అందుకేనా ఇంత పంతంతో క‌సిగా వ‌ర్క‌వుట్లు చేస్తోంది? అంటూ ఫ్యాన్స్ ఒక‌టే గుస‌గుస‌లు స్టార్ట్ చేశారు. `పుష్ప`‌లో బ‌న్నితో పోటీప‌డుతూ.. ఫిట్ గా క‌నిపించే ప్ర‌య‌త్న‌మే ఇది. మునుప‌టితో పోలిస్తే.. సన్నజాజి తీగ‌లాగా ర‌ష్మిక మేకోవ‌ర్ షాకివ్వ‌బోతోంద‌న్న‌మాట‌.