Begin typing your search above and press return to search.

చూపుల‌తోనే చంపేస్తున్న సుంద‌రి

By:  Tupaki Desk   |   28 April 2018 4:27 PM GMT
చూపుల‌తోనే చంపేస్తున్న సుంద‌రి
X
‘ఛ‌లో’ సినిమాలో త‌మిళ పిల్ల‌గా క‌ళ్ల‌ద్దాలు పెట్టుకుని ప‌ద్ద‌తిగా క‌నిపించి... తెలుగు వారంద‌రినీ క‌ట్టిప‌డేసింది ర‌ష్మికా మంద‌నా. ఆ సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో ఈ క‌న్న‌డ క‌స్తూరికి తెలుగులో అవ‌కాశాలు బాగానే వ‌స్తున్నాయి. అయితే తెలుగులో నెట్టుకు రావాలంటే కేవ‌లం అభిన‌యం మాత్ర‌మే ఉంటే స‌రిపోదు... గ్లామ‌ర్ కూడా కావ‌ల్సినంత చూపించాల్సిందే. అందుకే తెలుగు వారి కోస‌మే అన్న‌ట్టుగా తాజాగా ఓ ఫోటో షూట్ చేసింది ర‌ష్మిక‌.

స్లీవ్ లెస్ టీ ష‌ర్టు వేసుకుని... చిరుగుల ప్యాంటుతో ఈ ఫోటోల్లో క‌నిపిస్తోంది ర‌ష్మిక‌. చూడ‌డానికి నిండా బ‌ట్టలున్నా... స్కిన్ టైట్ డ్రెస్సు కావ‌డంతో క‌నిపించాల్సిన ఒంపు సొంపుల‌న్నీ క‌నిపిస్తూ కుర్రాల‌ను ఊరించేస్తున్నాయి. అవ‌న్నీ ఒక ఎత్త‌యితే తినేసేలా రెచ్చ‌గొడుతూ చూస్తున్న చూపులు... గులాబీ రంగులో ఊరిస్తున్న పెదాలు మ‌రో ఎత్తు. పాలమీగ‌డ‌లా ఉన్న ఒంటి రంగు ఈ క‌న్న‌డ పిల్ల‌కి పెద్ద ప్ల‌స్ పాయింట్‌. ఈ ఫోటోల‌ను చూస్తుంటే ర‌ష్మికా త్వ‌ర‌లోనే తెలుగులోనూ పెద్ద పెద్ద‌ అవ‌కాశాలు అందుకోవ‌డం ప‌క్కా! టాలీవుడ్ పైన కొంచెం ఫోక‌స్ పెడితే ఇక్క‌డ స్టార్ హీరోయిన్ అయిపోవ‌డ‌మూ ప‌క్కా.

ఇప్ప‌టికే ‘కిరాక్ పార్టీ’ మాతృక క‌న్న‌డ సినిమా ‘కిర్రిక్ పార్టీ’ తో సాండ‌ల్ వుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది ర‌ష్మిక‌. ఆ సినిమాలో హీరోగా న‌టించిన ర‌క్షిత్ శెట్టితో ప్రేమలో ప‌డి... గ‌త ఏడాది ఎంగేజ్ మెంట్ కూడా చేసేసుకుంది. త్వ‌ర‌లో పెళ్లి కూడా చేసుకోబోతోంది. ఒక‌వేళ మ్యారేజ్‌ చేసుకోవాల‌నే ఆలోచ‌న రాక‌పోతే మాత్రం ర‌ష్మిక కెరీర్ ఎక్క‌డికో వెళ్ల‌డం గ్యారెంటీ! లేదా స‌మంత‌లా పెళ్ల‌య్యాక కూడా ఎటువంటి హ‌ద్దులు పెట్టుకోకుండా న‌టిస్తుందేమో చూడాలి.