Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: చిరునవ్వుతో చంపేసింది

By:  Tupaki Desk   |   4 Jan 2018 4:50 PM GMT
ఫోటో స్టోరి: చిరునవ్వుతో చంపేసింది
X
టాలీవుడ్ లో కన్నడ బ్యూటీలు ఈ మధ్య భాగనే అవకశాలను దక్కించుకుంటున్నారు. మరి స్టార్ హీరోలతో కాకపోయినా ఓ మీడియం రేంజ్ మార్కెట్ ఉన్న హీరోలతో ఛాన్సులను అందుకొని హిట్స్ కొట్టేస్తున్నారు. ఒక వేళ సినిమా ఫెయిల్ అయిన కూడా పెద్దగా నష్టపోవడం లేదు. జయపజయలతో సంభందం లేకుండా అవకాశాలను అందుకుంటున్నారు. ఇక ప్రస్తుతం ఒక సినిమాతో కూడా పరిచయం కానీ ఓ కన్నడ బ్యూటీ ప్రస్తుతం అందరిని ఆకర్షిస్తోంది.

ఆమె ఎవరో కాదు రష్మీక మందన. ఛలో సినిమాతో పరిచయం కాబోతోన్న ఈ బ్యూటీ సాంగ్స్ టీజర్స్ తో భాగనే ఆకట్టుకుంటోంది. ఇక సోషల్ మీడియాలో కూడా రష్మిక కి ఈ మధ్య తెలుగు కుర్రాళ్ల సపోర్ట్ బాగా లభిస్తోంది. ఈ మధ్య ఫాలోవర్స్ సంఖ్య కూడా బాగానే పెరిగింది. అయితే అభిమానుల కోసమో లేక క్యాజువల్ గా ఫొటో దిగిందో లేదో తెలియదు గాని ఒక ఫొటోకి స్టిల్ ఇచ్చింది చూశారు. చంపేసింది అంతే. అందులో రష్మిక గ్లామర్ డోస్ ని బాగా చూపించిందా అంటే అది లేదు.

కేవలం చిన్న స్మైల్ తో కుర్రాళ్ల హార్ట్ ని ఈజిగా టచ్ చేసింది. చిరునవ్వు కి మరో అర్ధం ఈ పిల్లేనా అని అందరు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా అమ్మాయితో నవ్వు కన్నా పెద్ద అందం మరోటి లేదని రష్మీక చెప్పకనే చెప్పింది. ఇక ఈ బ్యూటీ ఛలో సినిమాతో పాటు తెలుగులో విజయ్ దేవరకొండతో ఒక సినిమా.. అలాగే మరో తెలుగు సినిమా చేస్తోంది.