Begin typing your search above and press return to search.

ఆరంభం కాకుండానే అటకెక్కిన గీతలో గీత ప్రాజెక్ట్‌!

By:  Tupaki Desk   |   13 April 2022 9:00 AM IST
ఆరంభం కాకుండానే అటకెక్కిన గీతలో గీత ప్రాజెక్ట్‌!
X
గీత గోవిందం సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ రష్మిక మందన్నా హీరోయిన్‌ గా గీతా ఆర్ట్స్ బ్యానర్‌ లో ఒక లేడీ ఓరియంటెడ్‌ సినిమా రూపొందబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. చిలసౌ చిత్ర దర్శకుడు రాహుల్‌ రవీంద్ర దర్శకత్వంలో బన్నీ వాసు ఈ లేడీ ఓరియంటెడ్ సినిమాను నిర్మించేందుకు సిద్దం అయ్యాడు. అల్లు అరవింద్‌ కూడా కథకు ఓకే చెప్పాడని.. షూటింగ్‌ కు రెడీ అవ్వమని ఆదేశించాడంటూ వార్తలు వచ్చాయి.

రష్మిక మందన్న ఫుల్‌ బిజీగా ఉండి కూడా గీత వారి ప్రాజెక్ట్‌ అవ్వడంతో డేట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పిందట. ఈమద్య కాలంలో హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేస్తున్న రష్మిక మందన్నా ఈ సినిమా తో పాన్ ఇండియా స్థాయిలో మరో సారి సక్సెస్ దక్కించుకుంటాను అనే నమ్మకం తో కనిపించిందట. కాని తీరా సినిమా పట్టాలెక్కబోతుంది అనుకున్న సమయంలో పక్కకు పెట్టేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రష్మిక మందన్నా హీరోయిన్ గా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన సినిమా ను బన్నీ వాసు కొన్ని కారణాల వల్ల పక్కకు పెట్టడానే వార్తలు వస్తున్నాయి. దర్శకుడు రాహుల్‌ విషయంలోనే కాస్త అపనమ్మకం తో ఉన్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ విషయమై ఎలాంటి క్లారిటీ రాలేదు.

మన్మధుడు 2 సినిమా తో డిజాస్టర్ ను మూట కట్టుకున్న దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ తదుపరి సినిమా విషయమై చాలా చర్చలు జరిపి చివరకు ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ను రూపొందిచబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని తీరా సినిమా చూస్తే అసలు ప్రారంభం కాకుండానే అటకెక్కింది.

రష్మిక మందన్నా శ్రీవల్లిగా పుష్ప సినిమా తో పాన్ ఇండియా స్టార్‌ డమ్‌ ను దక్కించుకుంది. దాంతో వరుసగా ఈమెకు భారీ చిత్రాల్లో ఆఫర్లు వస్తున్నాయి. పెద్ద ఎత్తున అంచనాలున్న సినిమాల్లో ఈ అమ్మడు నటిస్తుంది. తెలుగు మరియు తమిళ చిత్రాలతో పాటు హిందీలో కూడా ఈ అమ్మడు వరుసగా నటిస్తుంది. లేడీ ఓరియంటెడ్‌ సినిమాకు ఈమె మొదటి సారి ఓకే చెప్పడం.. ఆ సినిమా వస్తుందని అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా ప్రాజెక్ట్‌ అటకెక్కడంతో ఆమె అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.