Begin typing your search above and press return to search.

లక్కీ బ్యూటీ హిట్టిస్తుందా?

By:  Tupaki Desk   |   23 Jun 2018 5:41 AM GMT
లక్కీ బ్యూటీ హిట్టిస్తుందా?
X
టాలీవుడ్ లో మెగా హీరోలు అందరు ఎదో ఒక విధంగా బాక్స్ ఆఫీస్ దగ్గర స్టామినాని చూపిస్తున్నారు. కానీ అల్లు శిరీష్ మాత్రం ఇంకా తనకంటూ ఒక మార్కెట్ సెట్ చేసుకోలేకపోతున్నాడు. ఎన్ని అపజయాలు వచ్చినా కూడా ప్రయత్నం మాత్రం ఆపడం లేదు. ఇక రెగ్యులర్ గా కాకుండా ఇంకాస్త భిన్నమైన కథలను ఎంచుకోవాలని అనుకుంటున్నాడు. ఆ విధంగా ఆలోచిందే ఇటీవల మలయాళం హిట్టు కథ ఎబిసిడి ని సెట్స్ పైకి తెచ్చాడు.

ఈ రీమేక్ తప్పకుండా వర్కౌట్ అవుతుందని నిర్మాత మధుర శ్రీధర్ మంచి యూనిట్ ని సెట్ చేస్తున్నారు. సంజీవ్ రెడ్డి అనే కుర్రాడిని డైరెక్టర్ గా సెట్ చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా సినిమాను అధికారికంగా లాంచ్ చేశారు. రెగ్యులర్ షూటింగ్ లో ఇక వేగాన్ని పెంచాలని అనుకుంటున్నారు. ఇక సినిమాలో హీరోయిన్ గా కన్నడ లో మంచి క్రేజ్ అందుకొని తెలుగులో కూడా కుర్రకారు మనసును దోచుకుంటున్న రష్మిక మందాన ను ఫైనల్ చేశారు. ఛలో సినిమాతో ఈ భామహిట్టు అందుకున్న సంగతి తెలిసిందే.

అలాగే అర్జున్ రెడ్డి గీత గోవిందం సినిమాతో పాటు డియర్ కామ్రేడ్ సినిమాలలో నటిస్తోంది. నాగార్జున - నాని మల్టీస్టారర్ లో కూడా నటిస్తోంది. త్వరలో ఈ బ్యూటీ సౌత్ లో తన క్రేజ్ ను మరింత పెనంచేసుకునే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. ఇక అల్లు శిరీష్ సినిమాలో నటిస్తుండడంతో ఈ బ్యూటీ వల్ల కాస్త అదృష్టం దక్కుతుందని ప్లాన్ చేశారు. మరి రష్మిక ఛలో స్థాయిలో అల్లు బ్రదర్ కి హిట్టు ఇస్తుందో లేదో చూడాలి.