Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : శ్రీవల్లి సూపర్ హాట్ ఫోజ్‌

By:  Tupaki Desk   |   6 Jun 2022 3:30 PM GMT
ఫోటోటాక్ : శ్రీవల్లి సూపర్ హాట్ ఫోజ్‌
X
పాన్ ఇండియా స్టార్‌ హీరోయిన్ గా రష్మిక మందన్నా మారిపోయింది. తెలుగు తో పాటు కన్నడం.. తమిళం మరియు హిందీలో కూడా నటిస్తున్న రష్మిక మందన్నా ఇటీవల వచ్చిన పుష్ప సినిమా తో శ్రీవల్లిగా ఏ స్థాయిలో అలరించిందో అందరికి తెల్సిందే.

డీ గ్లామర్‌ పాత్రలో కనిపించడం అంటే చాలా పెద్ద సాహసం. పుష్ప లో ఒక విభిన్నమైన లుక్ లో కనిపించి కూడా ఈమె అక్కడ ఇక్కడ మరింత పాపులారిటీని దక్కించుకుంది.

సినిమాల్లో అందాల ఆరబోత చాలదన్నట్లుగా ఈ అమ్మడి సోషల్‌ మీడియాలో కూడా అందాల ఆరబోత నెక్ట్స్‌ లెవల్‌ అన్నట్లుగా ఉంది.

అందాల విందుతో ఆకట్టుకునే ఈ అమ్మడు తాజాగా ఫిల్మ్‌ ఫేర్‌ మ్యాగజైన్ పై అందాల ఆరబోతతో ఆకట్టుకుంది. చాలా యూనిక్ స్టైల్‌ లో హెయిర్‌ స్టైల్‌ తో నడుము అందాలను చూపిస్తూ పాకెట్‌ లో చేతులు పెట్టుకుని భలే ఉందంటూ కామెంట్స్‌ వస్తున్నాయి.

హీరోయిన్‌ గా ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తున్న ఈ అమ్మడు తెలుగు లో త్వరలో పుష్ప 2 తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమిళంలో ఈ అమ్మడు విజయ్‌ తో కలిసి ఒక సినిమాను చేస్తోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో రష్మిక మరియు విజయ్‌ రొమాన్స్‌ సినిమా లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కన్నడ ఇండస్ట్రీ లో హీరోయిన్‌ గా అడుగు పెట్టిన ఈ అమ్మడు ఛలో సినిమా తో తెలుగు లో అడుగు పెట్టింది. గీత గోవిందం సినిమా తో టాలీవుడ్ లో స్టార్‌ హీరోయిన్ గా నిలిచింది. హీరోయిన్ గా ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ స్టార్‌ హీరోయిన్ గా ఈ అమ్మడు అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. దాదాపుగా నాలుగు కోట్ల వసూళ్లు దక్కించుకుంటున్న హీరోయిన్ గా రష్మిక నిలిచిందనే వార్తలు వస్తున్నాయి.