Begin typing your search above and press return to search.

గీత చెప్పిన గుంటూరు అనుభ‌వం!

By:  Tupaki Desk   |   30 Sep 2018 5:30 PM GMT
గీత చెప్పిన గుంటూరు అనుభ‌వం!
X
మొద‌టి సినిమాతో మార్కులు ప‌డ్డా.. రెండో సినిమాతో ఇన్ స్టెంట్ గా టాప్ న‌టీమ‌ణి జాబితాలో చేరిపోవ‌ట‌మే కాదు.. ఆమెకు అవ‌కాశాలు వెల్లువెలా వ‌చ్చి ప‌డుతున్నాయి. ఇక‌.. యూత్ అయితే గీతకు ఫుల్ ఫిదా అయిపోయారు. ఒక్క సినిమాతో 'గీత' మారిన న‌టీమ‌ణుల జాబితాలో ర‌ష్మిక ముందుంటుంది.

హీరోయిన్ గా ఆమె ప్ర‌త్యేకంగా స్పెష‌ల్ క్వాలిటీస్ లేన‌ప్ప‌టికీ.. ఆమెను చూసినంత‌నే మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల‌నుకోవ‌టం.. అయస్కాంతం లాంటి కంటి చూపుతో క‌ట్టిప‌డేసే తీరు ఆమె సొంతం. తాజాగా ఒక మీడియా సంస్థ‌కు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర విష‌యాల్ని చెప్పుకొచ్చింది ర‌ష్మిక‌.

తెలుగులో త‌న తొలి చిత్రం ఛ‌లో షూట్ కోసం గుంటూరు వెళ్లిన ఆమెకు మ‌ర్చిపోలేని అనుభ‌వం ఒక‌టి ఎదురైందట‌. ఊహించ‌ని విధంగా ఆమెకు ఎదురైన ఆ ప‌రిస్థితుల్లో రోస్ట్ అయిపోయిన ఫీలింగ్ క‌లిగింద‌ట‌. ర‌ష్మిక ఏంటి? రోస్ట్ అయిపోవ‌టం ఏమిట‌న్న డౌట్ వ‌చ్చిందా? అక్క‌డికే వ‌స్తున్నాం. ఆ విష‌యం అర్థం కావ‌టంలే రీల్ గీత నేప‌థ్యం గురించి కాస్త తెలియాలి.

ర‌ష్మిత క‌ర్ణాట‌క‌లోని కూర్గ్ ప్రాంతానికి చెందిన అమ్మాయి. కూర్గ్ ప్ర‌త్యేక‌త ఏమంటే.. ఎప్పుడు చ‌ల్లగా ఉండి.. ద‌ట్ట‌మైన కాఫీ తోట‌ల‌తో నిండి ఉంటుంది. మేలో మ‌న‌కు నిప్పులు చెరిగే సూరీడు ఉంటే.. మ‌న‌కు కాస్త దూరంలో ఉన్న కూర్గ్ లో మాత్రం చ‌లితో వ‌ణికిపోవాల్సిందే. ఏడాది మొత్తం కూల్ కూల్ గా ఉండే ఈ కూర్గ్ భామ త‌న తొలి తెలుగు సినిమా షూటింగ్ లో భాగంగా గుంటూరుకు వెళ్లాల్సి వ‌చ్చింది.

మామూలుగానే గుంటూరు వేడిగా ఉంటుంది. ఇక‌.. ఎండాకాలం అయితే చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. కూర్గ్ లాంటి శీత‌ల ప్రాంతంలో పెరిగిన ర‌ష్మిక‌కు గుంటూరులో ఉండ‌టం మామూలుగా లేద‌ట‌. ఒక ద‌శ‌లో అయితే తాను రోస్ట్ అయిన భావ‌న క‌లిగింద‌ట‌. అలా.. గుంటూరు అంటే ఆమె వంటి నుంచి పొగ‌లు.. సెగ‌లు క‌క్క‌ట‌మే కాదు.. వామ్మో.. గుంటూరా? అనే ప‌రిస్థితి. గుంటూరు వేడి అనుభ‌వాన్ని తాను అస్స‌లు మ‌ర్చిపోలేన‌ని చెబుతోంది.