Begin typing your search above and press return to search.

రష్మిక 'ఎక్స్‌' రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు

By:  Tupaki Desk   |   4 Jun 2019 9:00 AM GMT
రష్మిక ఎక్స్‌ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు
X
సౌత్‌ లో ప్రస్తుతం రష్మిక టైం నడుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగులో ఇటీవలే మహేష్‌ బాబు మూవీకి ఓకే అయిన రష్మిక.. తమిళంలో స్టార్‌ హీరో విజయ్‌ కి జోడీగా ఒక చిత్రంలో నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. స్టార్‌ హీరోయిన్‌ గా దూసుకు పోతున్న రష్మిక గతంలో కన్నడ నటుడు రక్షిత్‌ శెట్టితో వివాహ నిశ్చితార్థం అయిన విషయం తెల్సిందే. గీత గోవిందం చిత్రం సక్సెస్‌ తో ఒక్కసారిగా సినిమా ఆఫర్లు రావడంతో పాటు.. చిన్న చిన్న విభేదాల కారణంగా రక్షిత్‌ శెట్టితో రష్మిక నిశ్చితార్థం బ్రేకప్‌ చేసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.

రష్మికతో బ్రేకప్‌ తర్వాత రకరకాలుగా సోషల్‌ మీడియాలో రష్మిక గురించి రక్షిత్‌ శెట్టి గురించి ప్రచారం జరిగింది. సోషల్‌ మీడియాలో విపరీతమైన కామెంట్స్‌ వచ్చేవి. దాంతో రక్షిత్‌ శెట్టి తన సోషల్‌ మీడియా అకౌంట్స్‌ ను గత 10 నెలలుగా డీ యాక్టివేట్‌ చేయడం జరిగింది. సోషల్‌ మీడియాకు పూర్తి దూరంగా ఉంటున్న రక్షిత్‌ శెట్టి మళ్లీ రీ ఎంట్రీకి ఒప్పుకున్నాడు. జూన్‌ 5న తన పుట్టిన రోజు సందర్బంగా తన సోషల్‌ మీడియా అకౌంట్స్‌ ను యాక్టివ్‌ చేయబోతున్నట్లుగా ప్రకటించాడు.

గతంలో సోషల్‌ మీడియాలో కొందరు చేస్తున్న కామెంట్స్‌ కారణంగా వర్క్‌ పై శ్రద్ద పెట్టలేక పోతున్నట్లుగా కారణం చెబుతూ వాటిని డీ యాక్టివేట్‌ చేసిన రక్షిత్‌ శెట్టి మళ్లీ అభిమానుల కోరిక మేరకు సోషల్‌ మీడియాలో రీ ఎంట్రీకి ఓకే చెప్పాడు. రేపటి నుండి రక్షిత్‌ శెట్టిని సోషల్‌ మీడియాలో చూడవచ్చు. ప్రస్తుతం ఈయన కన్నడంలో 'అవనె శ్రీమన్నారాయణ' చిత్రంలో నటిస్తున్నాడు. ఇక రష్మిక తెలుగు, తమిళం, కన్నడంలో పలు సినిమాలకకు కమిట్‌ అయ్యింది.. కొన్ని సినిమాల షూటింగ్స్‌ లో పాల్గొంటుంది.