Begin typing your search above and press return to search.

అక్కడ రష్మిక మొదటి సినిమాకు గుమ్మడికాయ

By:  Tupaki Desk   |   8 Oct 2020 12:37 PM GMT
అక్కడ రష్మిక మొదటి సినిమాకు గుమ్మడికాయ
X
కన్నడంలో హీరోయిన్‌ గా పరిచయం అయ్యి తెలుగులో ఛలో మరియు గీత గోవిందం సినిమాలతో స్టార్‌ హీరోయిన్‌ గా మారిపోయిన రష్మిక మందన్న తమిళంలో కూడా ఎంట్రీ ఇచ్చింది. కార్తీ హీరోగా రూపొందుతున్న సుల్తాన్‌ మూవీతో రష్మిక కోలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతుంది. అందుకు సంబంధించిన చిత్రీకరణ లాక్‌ డౌన్‌ కారణంగా ఆలస్యం అయ్యింది. ఈ ఏడాది ఆరంభంలోనే సినిమా రావాల్సి ఉన్నా కూడా కరోనా అడ్డు పడింది. ఎట్టకేలకు కార్తీ సుల్తాన్‌ మూవీ షూటింగ్‌ ను ముగించినట్లుగా రష్మిక మందన్న ఈ ఫొటోను షేర్‌ చేసింది.

నా మొదటి తమిళ సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యింది. వీరితో కలిసి వర్క్‌ చేయడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ప్రతి ఒక్కరితో నాకు మంచి బాండ్డింగ్‌ ఏర్పడింది. సుల్తాన్‌ ఖచ్చితంగా సక్సెస్‌ అవుతుందనే నమ్మకంను రష్మిక వ్యక్తం చేసింది. సుల్తాన్‌ పూర్తి అవ్వడంతో వచ్చే నెల నుండి అల్లు అర్జున్‌ తో పుష్ప సినిమాలో ఈ అమ్మడు జాయిన్‌ కాబోతుంది. టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్‌ గా వెలుగు వెలిగిన ఈ అమ్మడు కోలీవుడ్‌ లో సుల్తాన్‌ సినిమాతో సక్సెస్‌ దక్కించుకుంటుందా లేదా అనేది చూడాలి. సుల్తాన్‌ తర్వాత అక్కడ తదుపరి సినిమాకు కమిట్‌ అవ్వాలని రష్మిక భావిస్తుందట.