Begin typing your search above and press return to search.

హీరోల‌కు ఒక రూలు హీరోయిన్ల‌కు ఒక రూలా?

By:  Tupaki Desk   |   17 Dec 2020 1:00 PM IST
హీరోల‌కు ఒక రూలు హీరోయిన్ల‌కు ఒక రూలా?
X
కోవిడ్ విల‌యం వ‌ల్ల టాలీవుడ్ తీవ్రంగా న‌ష్ట‌పోయింది. కేవ‌లం నిర్మాత‌లే కాకుండా పంపిణీదారులు ఎగ్జిబిట‌ర్లు తీవ్రంగా న‌ష్ట‌పోయారు. అందువ‌ల్ల క్రైసిస్ నుంచి బ‌య‌ట‌ప‌డి తిరిగి కోలుకోవాలంటే దానికి ప‌రిహారం కావాల‌న్న‌ది ఇటీవ‌ల నిర్మాత‌ల గిల్డ్ ప్ర‌తిపాద‌న‌. అందుకు త‌గ్గ‌ట్టే స్టార్ల పారితోషికాల్లో 20శాతం కోత విధించి.. బ‌డ్జెట్ల‌ను కుదించేలా రూల్ ని ప్ర‌తిపాదించారు ఓ స‌మావేశంలో. 20 శాతం కోత పెట్టాలని యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రతిపాదించినా స్టార్లు ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న గుస‌గుసా వినిపిస్తోంది. ప్రస్తుతానికి ఏ మేల్ స్టార్ కూడా వారి వేతనం తగ్గించలేదు. అలాంట‌ప్పుడు నాయిక‌ల్ని త‌గ్గించ‌మ‌ని అడ‌గ‌డం న్యాయ‌మా?

కార‌ణం ఏదైనా కానీ.. న‌వ‌త‌రం క‌థానాయిక‌ రష్మిక మంద‌న‌ తన వేతనం తగ్గించుకోవడానికి నిరాకరిస్తోంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. వ‌రుస‌గా అగ్ర క‌థానాయ‌కుల స‌ర‌స‌న న‌టిస్తున్న ఈ భామ పారితోషికం విష‌యంలో స‌సేమిరా అనేస్తోంద‌ట‌. ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో న‌టించిన ర‌ష్మిక పారితోషికంలో ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. స‌రిలేరు నీకెవ్వ‌రు .. భీష్మ చిత్రాల‌కు తీసుకున్న‌దానికంటే మ‌రో 30శాతం అధికంగానే డిమాండ్ చేస్తోంద‌న్న గుస‌గుసా వైర‌ల్ అవుతోంది.

ఒక ర‌కంగా చెప్పాలంటే ర‌ష్మిక‌కు తెలుగులో ఫ్లాప్ అన్న‌దే లేకపోవ‌డంతో నిర్మాత‌లే త‌న‌ను ల‌క్కీ ఛామ్ గా భావించి అవ‌కాశాలిస్తున్నారు. అలాంట‌ప్పుడు డిమాండ్ చేయ‌డంలో త‌ప్పేమీ లేద‌న్న వాద‌నా వినిపిస్తోంది. అయినా మేల్ స్టార్ అయితే ఒక‌లా ఫీమేల్ స్టార్ అయితే ఒక‌లా ట్రీట్ చేస్తారా? అన్న ప్ర‌శ్న త‌లెత్తింది. శ‌ర్వానంద్ `ఆడాళ్లు మీకు జోహార్లు`కి క‌మిటైన ర‌ష్మిక పెద్ద చెక్ అందుకుంటోంద‌ట‌. అలాగే అఖిల్ - సురేందర్ రెడ్డి సినిమాకి పెద్ద ఫ్యాట్ చెక్ డిమాండ్ చేసింద‌ని దానికి నిర్మాత‌లు సిద్ధ‌మే అన్నార‌ని పుకార్ వినిపిస్తోంది. మ‌రి వీట‌న్నిటిపైనా ర‌ష్మిక స్పందిస్తుందేమో చూడాలి.