Begin typing your search above and press return to search.

నానికి రష్మిక కలిసొస్తుందా?

By:  Tupaki Desk   |   22 Aug 2018 7:12 AM GMT
నానికి రష్మిక కలిసొస్తుందా?
X
కొన్ని సమీకరణాలు భలే తమాషాగా ఉంటాయి. కాకతాళీయంగా జరిగినా బాక్స్ ఆఫీస్ ఫలితాలు చూసుకున్నప్పుడు అవును కదా అనిపించేలా చేస్తాయి. నాని విషయంలో ఇది అలాగే కనిపిస్తోంది మరి. విషయానికి వస్తే గత ఏడాది ఫిదాతో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న సాయి పల్లవి దాని తర్వాత నాని ఎంసిఎ చేసిన సంగతి తెలిసిందే. నానికి అప్పటికే తనకంటూ ఒక ఇమేజ్ మార్కెట్ ఉన్నప్పటికీ సాయి పల్లవి ఉండటం చాలా ప్లస్ గా మారి ఓపెనింగ్స్ విషయంలో సైతం హెల్ప్ అయ్యింది. అందులో పాత్ర రెగ్యులర్ హీరోయిన్ తరహాలోనే ఉన్నా సాయి పల్లవికి మంచి పేరైతే వచ్చింది. ఇక ఇప్పుడు గీత గోవిందంతో ఓ రేంజ్ లో తన పేరు మారుమ్రోగిపోయేలా చేసుకున్న రష్మిక మందన్న నాని కొత్త సినిమా దేవదాస్ లో హీరోయిన్. నాగార్జున ఉన్నప్పటికీ రష్మిక ఆడిపాడుతోంది నాని పక్కనే. సో సెంటిమెంట్ ప్రకారం ఎంసిఎ లాగే ఇది కూడా హిట్ అవుతుందన్న లెక్కలువేసుకోవడం మొదలుపెట్టారు అభిమానులు.

రష్మిక మందన్నకు దేవదాస్ హిట్ అయితే కెరీర్ పరంగా పెద్ద బూస్ట్ అవుతుంది. గీత గోవిందం చూసాక ఆఫర్ల వర్షం కురిపిస్తున్న నిర్మాతలలో ఎవరికి ఎస్ చెప్పాలి ఎవరికి నో చెప్పాలి అనే అయోమయంలో ఉంది రష్మిక. దానికి తోడు పారితోషికం అమాంతం పెంచేసి ఎక్కువ డిమాండ్ చేస్తున్నా ఇస్తామని ముందుకు వస్తున్నారట. మొత్తానికి రష్మికకు టైం బాగా కలిసి వస్తోంది. గ్లామర్ షో చేయకపోయినా ఛలో-గీత గోవిందంలతో సూపర్ సక్సెస్ అందటంతో సహజంగానే సాయి పల్లవితో పోలిక వస్తోంది. మరి మల్టీ స్టారర్ దేవదాస్ లో తనకు ఇంత స్కోప్ ఉన్న పాత్ర దక్కి ఉంటుందా అంటే కాస్త అనుమానంగానే ఉంది. ఎందుకంటే నాగ్ నానిల కాంబో కాబట్టి మూడో పాత్రకు వీళ్ళను దాటేసే రేంజ్ అవుట్ ఫుట్ ఇచ్చే సీన్లు ఉండటం కష్టమే. అయితేనేం హిట్ అయితే చాలు హ్యాట్రిక్ తన ఖాతాలో పడిపోతుంది అందుకే రష్మిక దాని ఫలితం పట్ల చాలా నమ్మకంగా ఉంది. మరి నానికి కూడా అలాగే కలిసివస్తే కృష్ణార్జున యుద్ధం చేదు జ్ఞాపకం త్వరగా మర్చిపోవచ్చు.