Begin typing your search above and press return to search.

అదేంటీ ర‌ష్మిక అలా అనేసింది!

By:  Tupaki Desk   |   22 Jan 2023 4:30 AM GMT
అదేంటీ ర‌ష్మిక అలా అనేసింది!
X
స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన త‌మిళ చిత్రం 'వారీసు'. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీని స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు అత్యంత భారీ స్థాయిలో నిర్మించారు. ఇందులో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టించిన విష‌యం తెలిసిందే. త‌మిళంలో ఈ మూవీని జ‌న‌వ‌రి 11న విడుద‌ల చేయ‌గా తెలుగులో 'వార‌సుడు' పేరుతో జ‌న‌వ‌రి 14న విడుద‌ల చేశారు. తెలుగులో కంటే త‌మిళంలోనే ఈ మూవీకి మంచి ఆదర‌ణ ల‌భిస్తోంది. ఇదిలా వుంటే ఈ మూవీపై ర‌ష్మిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ విజ‌య్ 'వారీసు'లో త‌న పాత్ర‌కు కేవ‌లం రెండు పాటలు త‌ప్ప న‌టించ‌డానికి ఏమీ లేద‌ని ర‌ష్మిక వెల్ల‌డించింది షాకిచ్చింది. హీరో విజ‌య్ కోస‌మే ఈ సినిమాలో తాను న‌టించాన‌ని చెప్పుకొచ్చింది. ఎలాంటి స్కోప్ లేని పాత్ర‌లో ఎందుకు న‌టించార‌ని అడిగితే ర‌ష్మిక పై విధంగా స్పందించింది. అంతే కాకుండా విజ‌య్ అంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని, ఈ సినిమాలో న‌టించ‌డం సొంత నిర్ణ‌య‌మేన‌ని చెప్పుకొచ్చింది.

అంతే కాకుండా విజ‌య్ తో క‌లిసి న‌టించాల‌న్న ఉద్దేశ్యంతోనే ఈ సినిమా చేశానంది. సినిమాలో నా పాత్ర‌కు ఎలాంటి ప్రాధాన్య‌త లేద‌ని, కేవ‌లం రెండు పాట‌లు మాత్ర‌మే వున్నాయ‌ని నాకు తెలుసు. అయితే ఆ రెండు పాట‌ల్లోనూ అద‌ర‌గొట్టాల‌నుకున్నాన‌ని తెలిపింది. ఇదే విష‌యాన్ని విజ‌య్ సార‌న్ ద‌గ్గ‌రికి వెళ్లి స‌ర‌దాగా చెబుతుండేదాన్నని స్ప‌ష్టం చేసింది. అంతే కాకుండా సినిమాలో రెండు పాట‌లు త‌ప్ప నాకు నటించ‌డానికి ఏమీ లేదు సార్ అని విజ‌య్ తో జోకులు చేసేద‌ట‌.

ఇక సినిమా సెట్ లో న‌టిగా అంద‌రి ద‌గ్గ‌రికి వెళ్లి చిన్న చిన్న విష‌యాలు నేర్చుకునేదాన్ని. న‌టిగా అన్ని ర‌కాల పాత్ర‌లు, సినిమాలు చేయాలి. అందుకే ఈ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ చేశా.

ఈ సినిమా విష‌యంలో నా వ‌ర‌కు నేను సంతృప్తిగానే వున్నాను' అంటూ చెప్పుకొచ్చింది ర‌ష్మిక మంద‌న్న‌. ఈ సినిమాలో రష్మిక జిమిక్కి పొన్ను, రంజిత‌మే వంటి గీతాల్లో త‌న‌దైన మార్కు డ్యాన్సుల‌తో అద‌ర‌గొట్టిన విష‌యం తెలిసిందే.

ర‌ష్మిక ప్ర‌స్తుతం పాన్ ఇండియా మూవీ 'పుష్ప 2'లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. దీనితో పాటు సందీప్ రెడ్డి వంగ ద‌ర్శ‌క‌త్వంలో ర‌ణ్ బీర్ క‌పూర్ హీరోగా రూపొందుతున్న 'యానిమ‌ల్‌'లోనూ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేస్తోంది. ఈ సినిమా అయినా ర‌ష్మిక కు బాలీవుడ్ లో బిగ్ బ్లాక్ బ‌స్ట‌ర్ ని అందిస్తుందేమో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.