Begin typing your search above and press return to search.

సెల్ఫీలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బన్నీభామ!

By:  Tupaki Desk   |   20 March 2021 12:30 PM GMT
సెల్ఫీలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బన్నీభామ!
X
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్ రష్మిక మందన క్రేజ్ మాములుగా లేదు. ఈ కన్నడభామ 'ఛలో' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫస్ట్ సినిమానే సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో వరుస అవకాశాలతో ప్రేక్షకులకు దగ్గరైంది. ఛలో తర్వాత గీతగోవిందం సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అప్పటినుండి మొన్నటి సరిలేరు నీకెవ్వరూ, భీష్మా సినిమాల వరకు వరుస హిట్లు తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకు అన్నీ బబ్లీ క్యారెక్టర్స్ చేసిన రష్మిక.. త్వరలోనే పుష్ప సినిమాతో ఓ ఛాలెంజింగ్ క్యారెక్టర్లో కనిపించనుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న 'పుష్ప' మూవీలో రష్మిక చిత్తూరు అమ్మాయిగా అలరించనుంది. పక్కా పల్లెటూరు అమ్మాయిగా అదే చిత్తూరు బాషా యాసలో పలకరించేందుకు రెడీ అవుతోంది.

అయితే పుష్ప షూటింగ్ దశలో ఉండగానే రష్మిక పలు క్రేజీ ప్రాజెక్టులను లైన్ లో పెట్టేసింది. ప్రస్తుతం అమ్మడికి ఖాళీ టైం లేకుండా చేతినిండా సినిమాలున్నాయి. మరో ఏడాది వరకు షెడ్యూల్ బిజీ అయ్యేలా సినిమాలు క్యూలో పెట్టుకుంది. టాలీవుడ్, శాండల్ వుడ్, కోలీవుడ్ మాత్రమే కాకుండా త్వరలో అమ్మడు.. బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టనుంది. బాలీవుడ్ యువహీరో సిద్దార్థ్ మల్హోత్రా, డెబ్యూ డైరెక్టర్ శాంతను బాగ్చి కాంబోలో రానున్న 'మిషన్ మజ్ను' సినిమాతో రష్మిక బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. అయితే ప్రస్తుతం ఓవైపు తమిళ సినిమా సుల్తాన్ చేస్తూనే మరోవైపు మిషన్ మజ్ను షూటింగ్ లో పాల్గొంటుంది. రేపవలు కష్టపడుతుండటంతో రష్మిక ఖాళీ సమయంలో క్రేజీ పోస్టులు పెడుతూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. తాజాగా అమ్మడు కళ్లు మూసుకొని.. వెరైటీ పోజులతో సెల్ఫీలు దిగింది. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.