Begin typing your search above and press return to search.

మైనస్ 2 డిగ్రీల చలిలో రష్మిక మందన్

By:  Tupaki Desk   |   23 Jan 2019 6:00 AM GMT
మైనస్ 2 డిగ్రీల చలిలో రష్మిక మందన్
X
గత ఏడాది చలోతో ఓ బ్లాక్ బస్టర్ గీత గోవిందంతో ఓ ఇండస్ట్రీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న హీరోయిన్ రష్మిక మందన్నకు దేవదాస్ రూపంలో చిన్న ఝలక్ తగిలినా అదేమెంత పెద్ద ఎఫెక్ట్ ఇవ్వలేదు. నితిన్ తో వెంకీ కుడుములు దర్శకత్వంలో భీష్మ(వర్కింగ్ టైటిల్)కు కమిట్ అయిన రష్మిక అటుపక్క కన్నడ సినిమాలతో సైతం బిజీగా ఉంది. ఇటీవల అక్కడ స్టార్ హీరో దర్శన్ సరసన యజమాన అనే సినిమాలో జంటగా నటించింది. అందులో ఒందు ముంజానే అనే పాటను స్వీడన్ లో చిత్రీకరించారు.

మంచు దట్టంగా కురుస్తూ అసలు మనుషులు కనిపించలేనంత పొగ కమ్ముకున్న వాతావరణంలో మైనస్ 2 డిగ్రీల చలిలో దీన్ని షూట్ చేసారట. యూనిట్ మొత్తం గజగజ వణుకుతున్నా దర్శన్ రష్మిక మందన్నలు మాత్రం దాన్ని పంటి కింద భరిస్తూ మొహంలో ప్రేమ ఎక్స్ ప్రెషన్స్ ని బాలన్స్ తప్పకుండ చూపించడం చూసి అందరూ షాక్ అయ్యారట. దీని గురించి రష్మిక మందన్న ప్రత్యేకంగా ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించింది. హరికృష్ణ-కుమార్ లి సంయుక్తంగా దర్శకత్వం దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంగీతం హరికృష్ణనే. శ్రేయ ఘోషల్-సోను నిగం పాడిన ఈ మెలోడీ ఇప్పటికే రెండు రోజుల్లో నాలుగు మిలియన్లకు చేరువగా వెళ్లిపోయింది.

పాట విజువల్స్ లో రష్మిక పిచ్చ క్యుట్ గా ఉంది. యాజమాన టైటిల్ శాండల్ వుడ్ లో చాలా సెంటిమెంట్. గతంలో ఇదే పేరుతో విష్ణువర్ధన్ నటించిన సినిమా ఇండస్ట్రీ రికార్డులు సెట్ చేసింది. దీన్నే తెలుగులో అప్పట్లో రాజశేఖర్ హీరోగా మా అన్నయ్య పేరుతో రీమేక్ చేస్తే అదే ఫలితం దక్కింది. అందుకే యాజమాన మీద హీరో హీరొయిన్ కాంబినేషన్ తో పాటు టైటిల్ పరంగా కూడా భారీ క్రేజ్ ఉంది. మొత్తానికి రెండు పడవల మీద రష్మిక ప్రయాణం మహా జోరుగా సాగుతోంది