Begin typing your search above and press return to search.

ర‌ష్మిక ని ఇలా చూస్తే మీకేమ‌నిపిస్తోంది?

By:  Tupaki Desk   |   11 Jan 2022 12:30 PM GMT
ర‌ష్మిక ని ఇలా చూస్తే మీకేమ‌నిపిస్తోంది?
X
ర‌ష్మిక మంద‌న్న చ‌లాకీత‌నం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. వేదిక ఎలాంటిదైనా త‌న‌దైన మార్క్ వేస్తుంది. అల్ల‌రి చేష్ట‌ల‌తో చుట్టూ ఉన్న వారిని ఆక‌ర్షించ‌డం ర‌ష్మిక ప్ర‌త్యేక‌త‌. ర‌ష్మిక లో అద‌నంగా ఉన్న ఆ క్వాలిటీ అమ్మ‌డి కెరీర్ కి క‌లిసొస్తోంది. హీరోల‌తో..ద‌ర్శ‌క‌నిర్మాత‌లతో ఇట్టే క‌లిసిపోవ‌డం త‌న ప‌నిని సులువు చేస్తుంది. వేదిక‌ల‌పై నుంచి కుర్రా కారుని త‌న‌దైన చ‌మ‌త్కారంతో ఆక‌ట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ కొత్త ఫోటో ఒక‌టి ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. అందుకు ప్ర‌త్యేక‌మైన కార‌ణం ఉంది. క‌న్న‌డ బ్యూటీ హాట్ లుక్ అందాల‌ ఎగ్జిబిష‌న్ తో చెల‌రేగింది.

మిరిమిట్లు గొలిపే డిజైన‌ర్ దుస్తుల్లో కెమెరాకి ఫోజులిస్తూ ఇన్న‌ర్ అందాల‌ను హైలైట్ చేసింది. ఈ ఫోటోని ఉద్దేశించి..ఈ లుక్ గురించి మీరేమ‌నుకుంటున్నారు? అంటూ త‌నే స్వ‌యంగా ఓ క్యాప్ష‌న్ ఇచ్చింది. అంతే కుర్రాకారులో ఆనందం ఒక్క‌సారిగా ప‌ర‌వ‌ళ్లు తొక్కింది. ఎవ‌రికి తోచిన కామెంట్లు వాళ్లు చేస్తూ ర‌ష్మిక‌ని ఫిదా చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఇక ర‌ష్మిక ఇటీవ‌లే `పుష్ప` `దిరైజ్` తో తొలి పాన్ ఇండియా స‌క్సెస్ ని ఖాతాలో వేసుకుంది. ఈ విజ‌యంతో ర‌ష్మిక క్రేజ్ రెట్టింపు అయింది. బాలీవుడ్ లో లాంచ్ కి ముందే ఇలా పాన్ ఇండియా స‌క్సెస్ అందుకోవ‌డం అమ్మ‌డి కెరీర్ కి క‌లిసొస్తుంది.

ప్ర‌స్తుతం ర‌ష్మిక బాలీవుడ్ లో `మిష‌న్ మ‌జ్ను`..`గుడ్ బై `చిత్రాల్లో న‌టిస్తోంది. ఇక తెలుగులో `ఆడ‌వాళ్లు మీకు జోహార్లు` లో న‌టిస్తోంది. కొత్త అవ‌కాశాల‌కు కొద‌వ‌లేదు. పుష్ప స‌క్సెస్ తో పారితోషికం హైక్ చేసిన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. పాన్ ఇండియా ఐడెంటిటీతోనే బ్యూటీ ఈ నిర్ణయం తీసుకుంద‌ని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ర‌ష్మిక ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతోంది. బాలీవుడ్..టాలీవుడ్ రెండు భాష‌ల్ని దున్నేస్తోంది.