Begin typing your search above and press return to search.

నేష‌న‌ల్ క్ర‌ష్‌ కోలీవుడ్ డెబ్యూ ఊహించ‌ని రిజ‌ల్ట్

By:  Tupaki Desk   |   12 April 2021 8:30 AM GMT
నేష‌న‌ల్ క్ర‌ష్‌ కోలీవుడ్ డెబ్యూ ఊహించ‌ని రిజ‌ల్ట్
X
క‌న్న‌డ ఆరంగేట్రం బ్లాక్ బ‌స్ట‌ర్.. ఆ వెంట‌నే తెలుగు డెబ్యూ బ్లాక్ బ‌స్ట‌ర్ ని మించిపోయింది. ఇప్పుడు కోలీవుడ్ బాలీవుడ్ లో తొలి అడుగులు వేస్తోంది. ఇటీవ‌లే కోలీవుడ్ లో తొలి సినిమా రిలీజైంది. అయితే ఆ సినిమా ఫ‌లితం బెడిసి కొట్టింది. ఆశించిన విజ‌యం ద‌క్క‌లేదు. అలా కోలీవుడ్ లో బ్యాడ్ ఎంట్రీ ఎదురవ్వ‌డం ఊహించ‌నిది అన్న టాక్ వినిపిస్తోంది. ఇదంతా ఎవ‌రి గురించి అంటే.. ది గ్రేట్ ర‌ష్మిక మంద‌న గురించే.

నేష‌న‌ల్ క్ర‌ష్ గా వెలిగిపోతున్న రష్మిక మంద‌న్న ఇప్ప‌టికిప్పుడు టాలీవుడ్ లో క్రేజీ స్టార్ గా సుస్థిర‌మైంది. ఇక్క‌డ‌ కేవ‌లం పెద్ద స్టార్లు పెద్ద బడ్జెట్ చిత్రాల్లో మాత్ర‌మే న‌టిస్తోంది. తెలుగు కన్నడ చిత్ర పరిశ్రమలను శాసిస్తోంది. త‌మిళంలోనూ త‌న హవా సాగించాల‌ని క‌ల‌లు గంది. గత వారం విడుదలైన సుల్తాన్ తో కోలీవుడ్ ‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కార్తీ హీరో. భారీ హైప్ మధ్య సుల్తాన్ విడుదల అయినా బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. దీంతో ర‌ష్మిక జోరుకు చిన్న బ్రేక్ ప‌డింది.

నిజానికి సుల్తాన్ లో ర‌ష్మిక‌కు చెప్పుకోద‌గ్గ పాత్ర కానే కాదు. కేవలం కొన్ని శృంగార సన్నివేశాలు పాటలకే పరిమితమైంది. ఈ చిత్రం స‌క్సెసైతే సెంటిమెంటు ప‌రిశ్ర‌మ‌లో క‌లిసొచ్చేదేమో కానీ త‌న‌కు గొప్ప పేరొచ్చేదే కాద‌ని విశ్లేషించారు. ఏదేమైనా అప‌జ‌యంతో నిరాశ మిగిలింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై రష్మిక చాలా ఆశలు పెట్టుకున్నా కానీ చివ‌రిక‌లా అయ్యింది.

మ‌రోవైపు బాలీవుడ్ లో ప‌లు క్రేజీ చిత్రాల‌తో స‌త్తా చాటే ప్ర‌య‌త్నంలో ఉంది. అక్క‌డ మిషన్ మజ్ను- గుడ్ బై అనే రెండు చిత్రాలలో నటిస్తోంది. సిద్ధార్థ్ మ‌ల్హోత్రా.. అమితాబ్ లాంటి స్టార్ల సినిమాల్లో న‌టిస్తూ హాట్ టాపిక్ గా మారింది. ఇక బాలీవుడ్ ఎంట్రీ సినిమాల రిజ‌ల్ట్ ఎలా ఉండ‌నుంది? అన్న‌ది వేచి చూడాలి.

మ‌రోవైపు పుష్ప త‌ర్వాత టాలీవుడ్ లో ఎన్టీఆర్- త్రివిక్ర‌మ్ సినిమా.. చ‌ర‌ణ్ -శంక‌ర్ సినిమా.. అంటూ క్రేజీ ఆఫ‌ర్లు ఉన్నాయి. వీట‌న్నిటితో ర‌ష్మిక అలా బండిని స‌జావుగా న‌డిపించేస్తుంద‌నడంలో సందేహ‌లేవీ లేవ్.