Begin typing your search above and press return to search.
రష్మికను అందుకే నేషనల్ క్రష్ అని పిలిచారు!
By: Tupaki Desk | 4 March 2021 7:00 AM ISTసోషల్ మీడియా- డిజిటల్ యుగంలో ప్రతిభావంతులకు గుర్తింపుతో పాటు ఫాలోయింగ్ చాలా సునాయాసంగా వచ్చేస్తోంది. సౌత్ లో పలువురు కథానాయికలు గూగుల్ సహా ట్విట్టర్ ఇన్ స్టాల్లో నేషనల్ లెవల్ లో ఐడెంటిటీ తెచ్చుకుంటున్నారు. జాతీయ స్థాయి ఫాలోయింగ్ ఏర్పడుతోంది. ఇక ఇటీవలి కాలంలో కన్నడ బ్యూటీ రష్మిక టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ హోదాకు ఎదిగింది. 2020 సంక్రాంతి బరిలో మహేష్ సరసన సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ లో నటించిన ఈ బ్యూటీకి జాతీయ స్థాయి ఫాలోయింగ్ ఏర్పడింది.
అప్పటి నుంచి రష్మిక మందనపై నేషనల్ లెవల్ క్రష్ తగ్గినట్టు లేదు. ఇప్పటికీ గూగుల్లో బాగా ట్రెండ్ అవుతోంది ఆ పేరు. టాలీవుడ్ లోనే కాకుండా ఇండియా లోనే మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా సత్తా చాటుతున్న ఈ బ్యూటీ నటించింది తక్కువ సినిమాలే అయినా తనకు ఆ స్థాయి గుర్తింపు దక్కింది.
గత మూడు రోజులుగా రష్మిక ఎలాంటి కారణం లేకుండానే జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతుండడం.. ట్విట్టర్ లో టాప్ ట్రెండ్స్ లో ఉండడం చూస్తుంటే తనకు ఆ రేంజు ఫాలోయింగ్ ఉందా? అంటూ ఆశ్చర్యపోతున్నారంతా. ఇదంతా తన ప్రతిభతోనే సాధించుకుందని ప్రశంసిస్తున్నారు. అయితే రష్మిక వరుసగా స్టార్ హీరోల సరసన నటించడం కూడా కలిసొస్తోంది. ఓవైపు బన్ని సరసన పుష్ప చిత్రంలో నటిస్తోంది. మరోవైపు అమితాబ్ అంత పెద్ద స్టార్ ఉన్న బాలీవుడ్ సినిమాలోనూ ఈ భామ నటించేందుకు సంతకం చేసింది. అందుకే గూగుల్ లో ఈ భామను సెర్చ్ చేసేవాళ్లు.. సోషల్ మీడియాల్లో అనుసరించేవాళ్లు పెరుగుతున్నారని భావించవచ్చు.