Begin typing your search above and press return to search.

అక్క‌డ టాటూ చూపెడుతూ ర‌ష్మిక టీజింగ్

By:  Tupaki Desk   |   26 July 2022 4:47 AM GMT
అక్క‌డ టాటూ చూపెడుతూ ర‌ష్మిక టీజింగ్
X
న‌టిగా కెరీర్ ప్రారంభించిన ఐదేళ్ల‌లోనే ఏ ఇత‌ర నాయిక‌కు సాధ్యం కాని రీతిలో సూప‌ర్ స్టార్ డ‌మ్ అందుకుంది ర‌ష్మిక మంద‌న‌. టాలీవుడ్ బాలీవుడ్ లో అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించేస్తూ ఈ బ్యూటీ బోలెడంత మ్యాజిక్ చేస్తోంది. ప‌రిశ్ర‌మ‌లో ఒక్కో సినిమాకు 3కోట్లు అంత‌కుమించి అందుకుంటున్న నాయిక‌గానూ ఇటీవ‌ల ర‌ష్మిక పేరు మార్మోగుతోంది. పుష్ప‌ శ్రీ‌వ‌ల్లిగా ఇప్పుడు హిందీ ఆడియెన్ గుండెల్లోనూ నిలిచింది. అక్క‌డ వ‌రుస‌గా సిద్ధార్థ్ మ‌ల్హోత్రా.. అమితాబ్ లాంటి స్టార్ల‌తో న‌టించేస్తూ నిరంత‌రం హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. అందం చిలిపిద‌నం న‌ట‌న‌తో ర‌ష్మిక ఈ రేంజులో దూసుకెళుతోంది.

ఇటీవ‌ల సోష‌ల్ మీడియాల్లో వేడెక్కించే ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ మ‌రింత‌గా ఫాలోయింగ్ పెంచుకుంటోంది. నేషనల్ క్రష్ అనే బిరుదుకు త‌గ్గ‌ట్టే వ‌రుస ఫోటోషూట్ల‌తో చెల‌రేగుతోంది. తాజా ఫోటోషూట్ లో ర‌ష్మిక ఒక అంద‌మైన టాట్టూని ప్ర‌ద‌ర్శించింది. ఒక‌ అందమైన మోనోక్రోమటిక్ ఫోటోలో రష్మిక ఎంతో అందంగా అల్ల‌రిగా కనిపిస్తోంది. ``ఇర్రీప్లేసబుల్`` అని మోచేతిపై రాసిన టాటూను కూడా ప్రదర్శించింది. ``ఈ రోజు మీ కోసం ఏదో అద్భుతం!`` అని దీనికి ట్యాగ్ ఇచ్చింది. ఈ స్నాప్ లను పోస్ట్ చేసిన వెంటనే అభిమానులు వ్యాఖ్యల‌ విభాగంలో ల‌వ్ ఈమోజీల‌తో దూసుకొచ్చారు. ఒక అభిమాని ``నువ్వు అందానికి చిహ్నం`` అని రాశాడు. మరొకరు `జార్జియస్` అని వ్యాఖ్యానించారు.

అమితాబ్ తో క‌లిసి గుడ్ బాయ్ లో న‌టిస్తున్న ర‌ష్మిక .. సిద్ధార్థ్ మ‌ల్హోత్రాతో క‌లిసి భారీ వార్ మూవీలో న‌టిస్తోంది. కరణ్ జోహార్ `స్క్రూ ధీలా` చిత్రంలో టైగర్ ష్రాఫ్ స‌ర‌స‌న ర‌ష్మిక నాయిక‌గా న‌టిస్తోంది. జూలై 25న కరణ్ జోహార్ టీజర్ ను విడుద‌ల చేయ‌గా ఆక‌ట్టుకుంది. ఈ చిత్రానికి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహిస్తున్నారు.

దుల్కార్ తో పాన్ ఇండియా మూవీలో

ఇంత‌కుముందే దుల్కార్ స‌ల్మాన్ న‌టించిన‌ `సీతా రామం` తెలుగు థియేట్రికల్ ట్రైలర్ విడుద‌లైంది. ఇది ఒక అనాథ సైనికుడు లెఫ్టినెంట్ రామ్ క‌థ‌తో మొదలవుతుంది. సీత అనే అమ్మాయి నుండి ఉత్తరం అందుకున్న తర్వాత అతని జీవితం ఎలా మారిపోయింది? అనేదే ఈ సినిమా. ఇందులో సీతా రాముల‌ను క‌లిపే ముస్లిమ్ యువ‌తిగా ర‌ష్మిక ఆమె స‌హ‌చ‌రుడిగా త‌రుణ్ భాస్క‌ర్ క‌నిపించ‌నున్నారు. లెఫ్లినెంట్ సీత‌ను కలుసుకున్న క్ర‌మంలో వారి మధ్య ప్రేమ వికసిస్తుంది. అతను కాశ్మీర్ లోని తన శిబిరానికి తిరిగి వ‌చ్చాక‌ అతను సీతకు ఒక లేఖ పంప‌గా.. అది త‌న‌కు చేరదు. 20 ఏళ్ల తర్వాత సీతకు లేఖ ఇచ్చే పనిని రష్మిక మందన్న పాత్ర చేప‌డుతుంది. చివ‌రికి ప్రేమికుల‌ను క‌లిపారా లేదా? అన్న‌ది తెర‌పైనే చూడాలి.

హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న‌ ఈ చిత్రానికి పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించ‌గా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్వప్న సినిమా నిర్మించగా వైజయంతీ మూవీస్ సమర్పిస్తోంది. గౌతమ్ మీనన్- ప్రకాష్ రాజ్- సుమంత్ - తరుణ్ భాస్కర్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రంతోనే బుల్లితెర వెండితెర‌ నటిగా పాపుల‌రైన‌ మృణాల్ ఠాకూర్ సౌత్ అరంగేట్రం చేస్తోంది. ఆగస్ట్ 5న సీతా రామం తెలుగు- తమిళం- మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది