Begin typing your search above and press return to search.

'పుష్ప' కోసం తంటాలు ప‌డుతున్న రష్మిక...!

By:  Tupaki Desk   |   29 Oct 2020 5:30 PM GMT
పుష్ప కోసం తంటాలు ప‌డుతున్న రష్మిక...!
X
కన్నడ బ్యూటీ రష్మిక మందాన్న‌ 'పుష్ప' సినిమాలో మెయిన్ హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ హ్యాట్రిక్ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందనున్న ఈ మూవీ ఎక్కువ భాగం అడవుల్లో ఉండబోతోంది. బన్నీ లారీ డ్రైవర్ గా మొరటు కుర్రాడిగా కనిపించనున్నాడు. మాసిన దుస్తులు.. గుబురు గడ్డం.. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో ఉన్న బన్నీ ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. ఇక పుష్ప రాజ్ కి తగ్గట్టే రష్మిక పాత్ర కూడా ఉండబోతోందని తెలుస్తోంది. ట్రైబల్ యువతిగా కనిపించడంతో పాటు చిత్తూరు యాసలో మాట్లాడనుందట. తన సినిమాల్లో హీరోయిన్స్ కి ప్రాధాన్యం ఉండే రోల్స్ క్రియేట్ చేసే సుక్కు.. 'పుష్ప' లో రష్మిక కి గుర్తిండిపోయే పాత్ర ఇచ్చాడని తెలుస్తోంది. 'రంగస్థలం' లో సమంతకి రామలక్ష్మిలా.. ఇది రష్మిక కు పేరు తెచ్చిపెడుతుందని అంటున్నారు.

ఇక ఈ సినిమాలో రష్మిక మందాన్న‌ లుక్ చాలా సెక్సీగా ఉండ‌బోతుంద‌ని యూనిట్ సభ్యులు వెల్లడించారు. ఈ పాత్ర కోసం ఫుల్ బాడీ షేప్ లోకి రావ‌డానికి ఈ బ్యూటీ తెగ ట్రై చేస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే రెగ్యులర్ వర్కౌట్స్ చేస్తూ బాగా కష్టపడుతోంది. అంతేకాకుండా ఈ పాత్ర కోసం ఆమెకు సుకుమార్ స్పెషల్ గా వర్క్ షాప్ కూడా నిర్వహించారట. ఏదేమైనా 'పుష్ప' సినిమా కోసం రష్మిక బాగానే హార్డ్ వర్క్ చేస్తోందని ఇండస్ట్రీ వర్గాలు మెచ్చుకుంటున్నాయి. 'పుష్ప' షూటింగ్ నవంబర్ 6 నుంచి వైజాగ్ పరిసర ప్రాంతాల్లో జరగనుంది. ఇదిలా ఉండగా రష్మిక ఈ సినిమాతో పాటు శ‌ర్వానంద్ హీరోగా నటిస్తున్న 'ఆడాళ్లూ మీకు జోహార్లు' అనే చిత్రంలో నటించనుంది. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని ఇటీవలే లాంఛనంగా ప్రారంభించారు.