Begin typing your search above and press return to search.

సింగం-4 లో వ్వాటే బ్యూటీ జాక్ పాట్

By:  Tupaki Desk   |   3 Feb 2020 4:55 AM GMT
సింగం-4 లో వ్వాటే బ్యూటీ జాక్ పాట్
X
బెంగుళూరు బ్యూటీ ర‌ష్మిక మంద‌న ఇస్పీడ్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. వ‌రుస‌గా క్రేజీ స్టార్ల స‌ర‌స‌న అవ‌కాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ కేట‌గిరీలో చేరిపోయింది. ఈ బ్యూటీ టాలీవుడ్ కెరీర్ ధేధీప్య‌మానంగా వెలిగిపోతుంది. ఇటీవ‌లే స‌రిలేరు నీకెవ్వ‌రు రూపంలో మంచి విజ‌యాన్ని అందుకుంది. ప్ర‌స్తుతం నితిన్ స‌ర‌స‌న భీష్మ‌లో న‌టించింది. త్వ‌ర‌లోనే సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ల్యాండ్ మార్క్ (ఏఏ20) చిత్రంలోనూ ర‌ష్మిక‌నే హీరోయిన్. తెలుగులో ఇంకా మ‌రిన్ని క‌మిట్ మెంట్లు ఉన్నాయి.

అయితే టాలీవుడ్ లో ఇంత బిజీగా ఉన్నా కోలీవుడ్ ని కూడా వ‌దిలి పెట్ట‌డం లేదు. ఇప్ప‌టికే సుల్తాన్ చిత్రంతో అక్క‌డ ఎంట్రీ ఇవ్వ‌డానికి రెడీ అవుతోంది. ఇందులో కార్తీ స‌ర‌స‌న రొమాన్స్ చేస్తుంది. ఇటీవ‌లే చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న చిత్ర‌బృందం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉంది. ఈలోగానే ర‌ష్మిక‌కు కోలీవుడ్ లో మ‌రో జాక్ పాట్ త‌గిలింది. కార్తీ సోద‌రుడు .. స్టార్ హీరో సూర్య స‌ర‌స‌న న‌టించే ఛాన్స్ అందుకుంది. సూర్య క‌థానాయకుడిగా మాస్ డైరెక్ట‌ర్ హ‌రి ఓ చిత్రాన్నికి స‌న్నాహాకాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైనర్ గా ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. ఇందులో హీరోయిన్ గా ర‌ష్మిక‌ను ఫైన‌ల్ చేసారు.

అయితే ఇది సింగం ప్రాంచైజీ లో నాలుగో చిత్ర‌మా? లేక కొత్తగా ఇంకేదైనా ఫ్రాంఛైజీని హ‌రి ప్రారంభించారా? అన్న‌ది తెలియాల్సి ఉంది. గ‌తంలో సింగం ప్రాంచైజీ నుంచి వ‌చ్చిన మూడు చిత్రాల్లో రెండు భాగాలు మంచి విజ‌యం సాధించాయి. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన సింగం-3 మాత్రం అంచనాలు అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. ఈ నేప‌థ్యంలో సింగం-4 స‌న్నాహకాల‌ పై సూర్య‌- హ‌రి బృందం ఎక్క‌డా పెద‌వి మెద‌ప‌డం లేదు. అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తే గానీ వీటి పై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం లేదు.