Begin typing your search above and press return to search.
క్షణమైనా తీరిక లేక రష్మిక ఆపసోపాలు.. హైదరాబాద్ టు ముంబై బిజీ బిజీ
By: Tupaki Desk | 26 July 2021 3:18 PM ISTవ్వాటే బ్యూటీ రష్మిక మందన రెండు పడవల ప్రయాణం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ బ్యూటీ హైదరాబాద్ టు ముంబై క్షణం తీరిక లేని ప్రయాణాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఓవైపు టాలీవుడ్ లో క్రేజీ సినిమాలతో అగ్ర నాయికగా వెలిగిపోతున్న ఈ బ్యూటీ బాలీవుడ ని ఏలేందుకు వెళుతోంది. వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తూ రష్మిక క్రేజీని అంతకంతకు పెంచుకుంటోంది. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రం `పుష్ఫ`లో అల్లు అర్జున్ సరసన, .. `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రంలో శర్వానంద్ తోనూ కలిసి నటిస్తోంది.
అటు బాలీవుడ్ లోనూ అమ్మడు పాగా వేయాలని సీరియస్ ప్రయత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ యువహీరో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన `మిషన్ మజ్ను` లో నటిస్తోంది. అలాగే బిగ్ బి అమితాబచ్చన్ నటిస్తోన్న `గుడ్ బై` చిత్రంలో డాటర్ పాత్రను పోషిస్తోంది. ఇలా టాలీవుడ్..బాలీవుడ్ అంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది.
ఇటీవలే లాక్ డౌన్ కూడా ఎత్తేయడంతో తిరిగి సినిమా షూటింగ్ లు యథావిధిగా ప్రారంభం కావడంతో అమ్మడు ముంబై టు హైదరాబాద్ చక్కర్లు కొడుతోంది. ఒక్క రోజు షూటింగ్ కోసం ఆదివారం హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లింది. నిన్నంతా మిషన్ మజ్ను షూటింగ్ లో పాల్గొంది. కేవలం బ్యాలెన్స్ సన్నివేశాలు కోసమే ముంబై వెళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెపై చిత్రీకరణ పూర్తయింది. అయితే ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ సీన్స్ నిన్నటి రోజున పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
అలాగే ఈ రోజు ఉదయమే మళ్లీ రష్మిక హైదరబాద్ లో ల్యాండ్ అయింది. ఇక్కడా ఆడవాళ్లు మీకు జోహార్లు షటింగ్ కి నేరుగా హాజరైనట్లు సమాచారం. మొత్తానికి రష్మిక కెరీర్ కోసం ఎంతగా శ్రమిస్తుందో ఈ ఒక్క సన్నివేశం చెప్పకనే చెబుతోంది. ఒకేసారి రెండు వేర్వేరు చోట్ల షూటింగ్ కి హాజరవ్వడం అంటే అంత వీజి కాదు. ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడుకున్న పని. ఎంతో ఫ్యాషన్ ఉంటే తప్ప ఇలాంటివి చేయడం ఈజీ కాదు. మొత్తానికి రష్మిక నటిగా ఎంత బిజీగా ఉందో మరోసారి తేటతెల్లమైంది.
సాటి స్టార్ హీరోయిన్లకు తప్పని జర్నీలు:
శ్రుతిహాసన్ ఇంతకుముందు ఇలాంటి సన్నివేశంలోనే ఉండేది.. పూజా హెగ్డే ఈ తరహాలో హెక్టిక్ షెడ్యూళ్లను మ్యానేజ్ చేస్తున్న సంగతి తెలిసినదే. పలువురు నాయికలు ఒకేసారి మూడు నాలుగు భాషల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నారు. తమన్నా.. నయనతార ఒకేసారి ఇరుగు పొరుగు భాషల్లో నటిస్తున్నారు. త్రిష అలాంటి ప్రయత్నాల్లోనే ఉంది.