Begin typing your search above and press return to search.

స్టార్‌ హీరోయిన్స్‌ నెంబర్‌ చేరిన రష్మిక

By:  Tupaki Desk   |   26 May 2019 10:26 AM GMT
స్టార్‌ హీరోయిన్స్‌ నెంబర్‌ చేరిన రష్మిక
X
బాలీవుడ్‌ హీరోయిన్స్‌ తో పోల్చితే సౌత్‌ లో హీరోయిన్స్‌ పారితోషికం విషయంలో కాస్త వివక్ష ఉంటుందనేది గత కొంత కాలంగా హీరోయిన్స్‌ చేస్తున్న విమర్శలు. బాలీవుడ్‌ లో హీరోల స్థాయిలో అక్కడ హీరోయిన్స్‌ కు కోట్లల్లో పారితోషికాలు ఇస్తూ ఉంటే సౌత్‌ లో హీరోయిన్స్‌ కు మాత్రం కొద్ది మంది హీరోయిన్స్‌ కు తప్ప ఎక్కువ శాతం మందికి లక్షల్లోనే పారితోషికం ఇస్తున్నారంటూ పలువురు హీరోయిన్స్‌ ఆఫ్‌ ది రికార్డ్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సౌత్‌ లో ఒక హీరోయిన్‌ కోటి రూపాయల పారితోషికం దక్కించుకుందంటే ఆమె స్టార్‌ హీరోయిన్‌ ల జాబితాలో చేరిపోయినట్లే. ఇప్పుడు రష్మిక మందన్న ఆ జాబితాలో చేరిపోయింది.

'ఛలో', 'గీత గోవిందం' చిత్రాలకు 10 నుండి 20 లక్షల మద్యలో పారితోషికం తీసుకున్న రష్మిక 'గీత గోవిందం' చిత్రం సూపర్‌ హిట్‌ అయిన తర్వాత తన పారితోషికంను 40 నుండి 50 లక్షల వరకు పెంచేసింది. ప్రస్తుతం వరుసగా తెలుగు, తమిళం, కన్నడంలో నటిస్తూ వస్తున్న ఈ అమ్మడు తన పారితోషికంను మరింతగా పెంచుతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. స్టార్స్‌ నుండి ఆఫర్లు అందుతున్న నేపథ్యంలో ఈమె తన పారితోషికం స్టార్‌ హీరోయిన్స్‌ పారితోషికం రేంజ్‌ లో పెంచేసింది.

స్టార్‌ హీరోయిన్స్‌ పొందే కోటి పారితోషికంను రష్మిక డిమాండ్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. హీరో మరియు దర్శకుడిని బట్టి రష్మిక పారితోషికం డిమాండ్‌ చేస్తుందనే టాక్‌ వినిపిస్తుంది. స్టార్‌ హీరోలతో అయితే 80 లక్షల వరకు, చిన్న హీరోలకు జోడీగా అయితే కోటి వరకు ఈమె డిమాండ్‌ చేస్తుందట. మూడు భాషల్లో ప్రస్తుతం టాప్‌ స్టార్‌ గా పేరు దక్కించుకున్న ఈ అమ్మడు ముందు ముందు తన పారితోషికంను మరింతగా పెంచే అవకాశాలు లేకపోలేదనిపిస్తుంది.