Begin typing your search above and press return to search.
'విక్రమార్కుడు' సీక్వెల్ ఛాన్స్ రష్మిక కొట్టేసిందా?
By: Tupaki Desk | 2 Jun 2023 10:00 PMటాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'విక్రమార్కుడు' బాలీవుడ్ లో రీమేక్ రూపంలో నూ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ కథానాయకుడిగా 'రౌడీ రాథోడ్' టైటిల్ తో తెరకెక్కిన సినిమా అక్కడా సంచలన విజయాన్ని నమోదు చేసింది.
2012 లో రిలీజ్ అయిన సినిమా బాలీవుడ్ హయ్యస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది. తాజాగా 11 ఏళ్ల విరామం తర్వాత ఈ సినిమా కి సీక్వెల్ కి రంగం సిద్దమవుతుంది.ఈ సీక్వెల్ లో అక్షయ్ కుమార్ స్థానంలో షాహిద్ కపూర్ హీరో గా నటించబోతున్నట్లు తెలుస్తుంది.
రౌడీ రాథోడ్ కి దర్శకత్వం వహించిన ప్రభుదేవా స్థానంలో సీక్వెల్ కి అనీష్ బజ్మీ బాధ్యతలు తీసుకున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో చిత్రాన్ని రూపొందించేందు కు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక సినిమా లో హీరోయిన్ నేషనల్ క్రష్ బ్యూటీ రష్మిక మందన్నని ఎంపిక చేసినట్లు సమాచారం. రష్మిక చలాకీ తనంతో పాత్రకు మరింత వన్నె తీసుకొస్తుంది అన్న కాన్పిడెన్స్ తో అనీష్ ఆమె వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇదే గనుక నిజమైతే అమ్మడికి జాక్ పాట్ లాంటి అవకాశమే. బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే బిజీ అవుతుంది.
నటిగా నిరూపించుకునే అవకాశం ఏది వచ్చినా విడిచి పెట్టడం లేదు. ప్రస్తుతం రణబీర్ కపూర్ సరసన రొమాన్స్ చేస్తుంది. సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న సినిమా పై అంచనాలున్నాయి. ఇందులో మరోసారి రొమాంటిక్ రష్మికని కాస్తా ఘాటుగానే చూపించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇంతలోనే రీమేక్ ఆఫర్ తో మరోసారి బాలీవుడ్ మీడియా లో రష్మిక పేరు హాట్ టాపిక్ గా మారింది. రష్మిక సినిమా కి డేట్లు కూడా కేటాయించినట్లు వినిపిస్తుంది.
ప్రస్తుతం రౌడీ రాథోడ్ -2కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయినట్లు తెలిసింది. యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపొందనున్న ఈ సీక్వెల్‌కు బాలీవుడ్ అగ్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నిర్మాతగా వ్యవహరించనున్నట్లు సమాచారం.