Begin typing your search above and press return to search.

రష్మీక కూడా ఇక అదే బాపతు..!

By:  Tupaki Desk   |   13 Jan 2020 12:51 PM IST
రష్మీక కూడా ఇక అదే బాపతు..!
X
ఛలో మరియు గీత గోవిందం సినిమాలతో ఒక్కసారిగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయిన ముద్దుగుమ్మ రష్మీక మందన్న. ఈ అమ్మడు కెరీక్ ఆరంభంలో మంచి పాత్రలు చేసింది. కనుక ఈమెను అభిమానించే వారు చాలా ఎక్కువ అయ్యారు. ఇతర హీరోయిన్స్ కేవలం గ్లామర్ డాల్స్ గా మాత్రమే కనిపిస్తూ ఉంటే ఈమె మాత్రం నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేసింది.

ఇన్నాళ్లు ఈమెను తెగ అభిమానించిన వారు ఇప్పుడు మాత్రం కాస్త విమర్శలు చేస్తున్నారు. వారి విమర్శలకు కారణం సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఆమె పాత్ర. ఇప్పటి వరకు గౌరవ ప్రధమైన పాత్రలో చేసిన రష్మీక సరిలేరు నీకెవ్వరు సినిమాలో మాత్రం మరీ కూరలో కరివేపాకు పాత్ర చేసింది. ఆ పాత్ర సినిమాలో ఏమాత్రం ప్రాముఖ్యతను కలిగి లేదు.

ఇన్నిరోజులు రష్మీక స్పెషల్ అనుకున్నవారికి ఈ సినిమాలోని ఆమె పాత్ర మింగుడు పడటంలేదు. ఈ అమ్మడు ఇక పై ఇలాంటి సినిమాలే చేయబోతుందా.. ఇలాంటి పాత్రల్లోనే ఈమెను చూడాలా అంటూ అభిమానులు ఒకింత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమర్షియల్ హీరోయిన్ గా రాణించాలి అంటే ఇలాంటి పాత్రలు చేయక తప్పదు అంటూ కొందరు సరిపెట్టుకుంటున్నారు.