Begin typing your search above and press return to search.

గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ తో గీత ఫ్యాన్స్ హ్యాపీ!

By:  Tupaki Desk   |   14 Dec 2018 10:55 AM IST
గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ తో గీత ఫ్యాన్స్ హ్యాపీ!
X
ఈ మధ్యనే గూగుల్ వారు 2018 సంవత్సరానికి ఇండియాకు సంబంధించిన సెర్చ్ ట్రెండ్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో సౌత్లో మోస్ట్ సెర్చ్డ్ సౌత్ ఇండియన్ స్టార్ గా మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో నిలిచాడు. 'సైరా' లాంటి క్రేజీ పీరియడ్ ఫిలిం చేస్తున్న మెగాస్టార్ పై ఆ మాత్రం ఆసక్తి వ్యక్తమవడం కామనే.

ఓవరాల్ ఇండియా ట్రెండ్స్ లో చూసుకుంటే ప్రియా ప్రకాష్ వారియర్ నెంబర్ వన్ స్థానంలో నిలవడం విశేషం. కన్నుగీటిన విడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది కాబట్టి సన్నీ లియోన్ ను దాటి ప్రియా వారియర్ ముందుకు వెళ్ళిపోయింది. ఇక సౌత్లో మోస్ట్ సెర్చ్డ్ సెలబ్రిటీగా రష్మిక మందన్న ఐదవ స్థానంలో నిలిచింది. ఇప్పటివరకూ కన్నడ.. తెలుగు సినిమాలు మాత్రమే చేసినా ఆమె ఈ ఘనత సాధించడమే విశేషమే. ముఖ్యంగా విజయ్ దేవరకొండ తో కలిసి నటించిన 'గీత గోవిందం' సూపర్ డూపర్ హిట్ కావడంతో రష్మిక పేరు సౌత్ లో మార్మోగిపోయింది.

ఇప్పటికే తమిళ ప్రేక్షకులు రష్మికను ఎప్పుడు కోలీవుడ్ ఎంట్రీ ఇస్తావని అడుగుతూ ఉన్నారు. త్వరగా ఒక తమిళ చిత్రంలో నటించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇలాంటి సమయంలో గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ లో సౌత్ కు సంబంధించి ఐదవ స్థానంలో నిలవడం ఫ్యాన్స్ దిల్ ఖుష్ చేసింది. రష్మిక ప్రస్తుతం విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'డియర్ కామ్రేడ్' లో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బిజీ హీరోయిన్ గా మారిన రష్మిక ఈ సినిమా కూడా హిట్ ఐతే మరింత క్రేజీగా మారుతుందనడంలో సందేహం లేదు.