Begin typing your search above and press return to search.

బాలీవుడ్ అటెన్ష‌న్ కోసం ర‌ష్మిక పాట్లు!

By:  Tupaki Desk   |   29 Sep 2022 6:31 AM GMT
బాలీవుడ్ అటెన్ష‌న్  కోసం ర‌ష్మిక పాట్లు!
X
కూర్గ్ బ్యూటీ ర‌ష్మిక అలియా క్ర‌ష్మిక భారీ ఆశల‌తోనే బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తోన్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ లో ఆడ‌తా పాడ‌తా ఎంట్రీ ఇచ్చినా? బాలీవుడ్ ని మాత్రం ఆరంభమే అద‌ర‌గొట్టాల‌ని సీరియ‌స్ ప్రణాళిక‌ల‌తో ముందుకు క‌దులుతోంది. సినిమాల‌కంటే ముందే బాలీవుడ్ ఆడియ‌న్స్ ని బుట్ట‌లో వేసుకోవాల‌ని అమ్మ‌డు చేయ‌ని ప్రయ‌త్నమంటూ లేదు.

అవార్డు వేడుక‌ల్లో డిజైన్ దుస్తుల్లో త‌ళుక్కున మెరిసింది. స్కిన్ షో...క్లేవేజ్..థైషో అంటూ బాలీవుడ్ కి క‌నెక్ట్ అయ్యే ప్ర‌య‌త్నం చేసింది. ఉత్త‌రాది ప్రేక్ష‌కుల అభిరుచికి త‌గ్గ‌ట్టు రూప లావ‌ణ్యంలో మార్పులు తీసుకొచ్చి మెప్పించే ప్ర‌య‌త్నం చేసింది. ఇదంతా అమ్మ‌డు హిందీ లో ఒక్క సినిమా కూడా చేయ‌క‌ముందే చేసేసింది. మ‌రి ముంగిట సినిమా రిలీజ్ అవుతుందంటే? ఆ సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మాలుకు హాజ‌ర‌య్యే ఛాన్స్ దొరికితే విడిచిపెడుతుందా? అన్ని బాధ్య‌త‌లు తానే భుజాన వేసుకుని మోసేయ‌దు.

అవును ఇప్పుడ‌దే జ‌రుగుతోంది. అమ్మ‌డి బాలీవుడ్ డెబ్యూ మూవీ 'గుడ్ బై' త్వ‌ర‌లో రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా యూనిట్ ప్ర‌చారం ప‌నులు మొద‌లు పెట్టింది. ఇందులో బిగ్ బీ అమితాబ‌చ్చ‌న్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఆయ‌న‌దే సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌. సినిమాని ప్ర‌మోట్ చేయాల్సిన బాధ్య‌త ఆయ‌న‌కుంది. కానీ అమితాబ్ మాత్రం రెస్ట్ తీసుకుంటున్నారు.

దీంతో ఆ బాధ్య‌త‌లు మొత్తం ర‌ష్మిక‌నే తీసుకుంది. ప్ర‌స్తుతం సినిమా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు వేగంగా జ‌రుగుతోన్న నేప‌థ్యంలో ఏ ఈవెంట్ లో చూసిన ర‌ష్మిక క‌నిపిస్తుంది. సినిమా గురించి త‌న‌దైన శైలిలో చెప్పుకొస్తుంది. ద‌ర్శ‌క‌-నిర్మాత‌ల్ని సైతం ప‌క్క‌న‌బెట్టేసి ఫోక‌స్ అవ్వాల‌ని ప్ర‌య‌త్నం చేస్తుంది. త‌న‌దైన శైలి ప్రచారంతో సినిమాతో పాటు..త‌న‌కు వ్య‌క్తిగ‌త ప్ర‌చారం ద‌క్కుతోంది.

ఇంత వ‌ర‌కూ ఏ తెలుగు సినిమాని అమ్మ‌డు ఇంత‌లా ప్ర‌మోట్ చేసింది లేదు. నిర్మాత‌లు ఆహ్వానం మేర‌కు కాద‌న‌లేక వెళ్లినా త‌న లిమిట్స్ కి లోబ‌డే ప్ర‌చారం చేసింది. కానీ గుడ్ బై సినిమా విష‌యంలో ఫ‌రిదిని దాటి మ‌రీ ప్ర‌చారం చేస్తుంద‌ని మీడియా క‌థ‌నాలు సైతం వెడెక్కిస్తున్నాయి. ఇది బాలీవుడ్ లో తొలి సినిమా అయినా..అమ్మ‌డి ఖాతాలో ఇంకా మూడు..నాలుగు హిందీ సినిమాలున్నాయి.

'మిషన్ మజ్ను'.. 'యానిమల్' చిత్రాలు సెట్స్‌లో ఉన్నాయి. అవి వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. మరో రెండు బాలీవుడ్ సినిమాల కోసం చర్చలు జరుపుతోంది. ఇలా ఇన్ని ప్రాజెక్ట్ లు చేతిలో ఉన్నా ఒకే ఛాన్స్ అన్న మాదిరి తొలి సినిమాతోనే ఆడియ‌న్స్ ని బుట్ట‌లో వేసుకునే ప్ర‌య‌త్నం చేస్తుంది. ప్రచార కార్యక్రమంలో సొగ‌స‌రి పొట్టి మైక్రో స్కర్ట్‌లను ధరించి స్కిన్ షోతో కుర్రాళ్ల‌లో కాక‌లు పుట్టిస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.