Begin typing your search above and press return to search.

పూజాహెగ్డేని డిస్ట‌ర్బ్ చేస్తోన్న ర‌ష్మిక‌!

By:  Tupaki Desk   |   13 July 2022 1:30 AM GMT
పూజాహెగ్డేని  డిస్ట‌ర్బ్ చేస్తోన్న ర‌ష్మిక‌!
X
నేష‌న‌ల్ క్ర‌ష్ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నబాలీవుడ్ లో బిజీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. సౌత్ లో అన్ని భాష‌ల్ని చుట్టేసి తుదిగా హిందీ ప‌రిశ్ర‌మ‌లో స్థిర‌ప‌డాల‌న్న‌ది అమ్మ‌డి కోరిక‌. ఆదిశ‌గానే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. సౌత్ లో మంచి అవ‌కాశాలు వ‌స్తున్నా..వాటిని సైతం కాద‌నుకుని బాలీవుడ్ లో బీజీ అవుతోంది.

'పుష్ప‌'తో వ‌చ్చిన పాన్ ఇండియా క్రేజ్ తో మ‌రింత ఫేమ‌స్ అయింది. బాలీవుడ్ మేక‌ర్స్ సైతం అమ్మ‌డినికి బాగానే ప్రోత్స‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం ర‌ష్మిక ఖాతాలో 'మిష‌న్ మ‌జ్ను'..'గుడ్ బై'..'యానిమ‌ల్' చిత్రాలున్నాయి. ఇవిగాక కొత్త అవ‌కాశాలు వ‌స్తున్నాయి.

మ‌రి ర‌ష్మిక‌లో ఈ వేగం పూజాహెగ్డే వేగానికి అడ్డంకిగా మారిందా? పూజాఖాతాలో ప‌డాల్సిన ఆఫ‌ర్ల‌న్నీ ర‌ష్మిక ఖాతాలో ప‌డుతున్నాయా? పూజి బ్యూటీని ర‌ష్మిక అంత‌లా డిస్ట‌ర్బ్ చేస్తుందా? అంటే అవున‌నే టాక్ వినిపిస్తుంది.

పూజాహెగ్డే కూడా బాలీవుడ్ లో బిజీ అయ్యే ప్ర‌య‌త్నాలు కొన్ని నెల‌లు గా సీరియ‌స్ గానే సాగిస్తోంది. ప్ర‌స్తుతం హిందీలో 'క‌బీ ఈద్ దివాలీ'..'సిర్క‌స్' చిత్రాల్లో న‌టిస్తోంది. ఈ రెండు మిన‌హా కొత్త చిత్రాల్లో ఛాన్స్ రాలేదు. అయితే ర‌ష్మిక ఖాతాలో ఉన్న అవ‌కాశాల‌న్ని త‌న‌కే ద‌క్కాలిట‌. అనివార్య కార‌ణాల వ‌ల్లే ఆ ప్రాజెక్ట్ లు పూజాహెగ్డే చేజార్చ్ కుంటుంద‌ని తాజాగా విష‌యం వెలుగులోకి వ‌స్తోంది.

కొన్ని కొత్త అవ‌కాశాలు సైతం పూజానే ద‌క్కించుకోవాల్సి ఉండ‌గా అవి చేజారిపోతున్నాయ‌ని వినిపిస్తోంది. దీనికి కారణాలు అనేక‌మైనా..స్వ‌యంకృపరాధం కొంత ఉంద‌ని వినిపిస్తోంది. ఆ మ‌ధ్య బాలీవుడ్ డెబ్యూ మూవీ 'మెహంజ‌దారో'పై పూజాహెగ్డే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అదో చెత్త సినిమా అని.. ఆ సినిమా చేయ‌డం కెరీర్ కొంత నాశ‌నం అయింద‌ని ఆరోపించింది.

ప్ర‌స్తుతం చేతిలో ఉన్న బాలీవుడ్ అవ‌కాశాల త‌ర్వాతే అలాంటి ఆరోప‌ణ‌లు చేసినా..త‌న‌లో ఆ ర‌క‌మైన‌ యాటిట్యూడ్ కూడా కొంత వ‌ర‌కూ బాలీవుడ్ కి దూరం చేసింద‌ని తాజాగా వెలుగులోకి వ‌స్తోంది. ర‌ష్మిక బాలీవుడ్ ఎంట్రీ కూడా పూజాహెగ్డే ఆఫ‌ర్ల‌కు కొంత వ‌ర‌కూ అడ్డుక‌ట్ట వేస్తుంద‌ని అంటున్నారు. పాన్ ఇండియా వైడ్ ర‌ష్మిక ఫాలోయింగ్ పూజా క‌న్నా బెట‌ర్ గా క‌నిపించ‌డం స‌హా..పారితోషికంలో ప‌ట్టువిడుపు వంటి స‌న్నివేశాలు నిర్మాత‌ల్ని ర‌ష్మిక వైపు అట్రాక్ట్ చేస్తున్నాయ‌ని తెలుస్తోంది.